మైనర్ పై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు, జరిమానా...

By AN TeluguFirst Published Jun 21, 2021, 3:02 PM IST
Highlights

స్నేహం పేరుతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డ కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. నల్గొండ జిల్లా, కొండ మల్లెపల్లి మండలానికి చెందిన నిందితుడు రామవత్ నరేష్ (20), కోల్ముంతై పహాద్ గ్రామ నివాసైన మైనర్ బాలిక (17)  పరిచయం చేసుకుని స్నేహం పెంచుకున్నాడు.
 
2017లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ ముసుగులో ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడు బాధితురాలిని మల్లెపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ కొండలకు తీసుకెళ్లి, అక్కడ రెండు రోజుల పాటు గుడిసెలో బంధించి, ఆమెపై పలుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసు ఇన్స్పెక్టర్ ఐఓ జె.మధన్ మోహన్ రెడ్డి ఆధారాలు సేకరించి, నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. దర్యాప్తు పూర్తయిన తరువాత 2017 డిసెంబర్ 23న కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 

ఈ కేసులో సోమవారం (జూన్21, 20121) నాడు తుది తీర్పు వెలువడింది. ఎల్.బి నగర్‌లోని తొమ్మిదవ ఎడిజె కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు రూ. 3000జరిమానా విధించింది. 

ఐఓ జె.మాధన్ మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిడిఓ ఎం. బిక్షపతి, అదనపు పిపి రాము, మంజుల దేవి, అదనపు ప్రాసిక్యూషన్ తరపున పిపి హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులకు సి.పి.రాచకొండ మహేష్ ఎం భగవత్  ప్రశంసించారు.

click me!