వరంగల్‌లో మల్టీలెవల్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసీఆర్ శంకుస్థాపన

By narsimha lode  |  First Published Jun 21, 2021, 2:37 PM IST

వరంగల్ లో మల్టీస్పెషాలిటీ  ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు తెలంగాణ సీఎం 
సోమవారం నాడు శంకుస్థాపన చేశారు.  59 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు.   గతంలో వరంగల్ సెంట్రల్ జైలు  ఉన్న స్థలంలో కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. 
 


వరంగల్:  వరంగల్ లో మల్టీస్పెషాలిటీ  ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు తెలంగాణ సీఎం సోమవారం నాడు శంకుస్థాపన చేశారు.  59 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు.   గతంలో వరంగల్ సెంట్రల్ జైలు  ఉన్న స్థలంలో కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. 

వరంగల్ సెంట్రల్ జైలులోని  ఖైదీలను  పలు జిల్లాల జైళ్లకు తరలించారు. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను చర్లపల్లి జైలుకు తరలించారు. గత మాసంలో వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో వరంగల్ సెంట్రల్ జైలును  కూల్చి ఆ స్థలంలో ఆసుపత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఈ స్థలంలో ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.

Latest Videos

undefined

కెనడాలోని ఆసుపత్రుల మాదిరిగా  ఈ ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది.  దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రకాల సౌకర్యాలతో పాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. 30 అంతస్థులత్లో ఆసుపత్రిని నిర్మించనున్నారు.  ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం సుమారు రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం తలపెట్టింది.  ఈ ఆసుపత్రి పైనే ఎయిర్ అంబులెన్స్ కోసం హెలిపాడ్ ను నిర్మించనున్నారు.  వరంగల్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 


 

click me!