హైద్రాబాద్ డీఏవీ స్కూల్‌లో చిన్నారులపై లైంగిక దాడి: డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

By narsimha lode  |  First Published Apr 18, 2023, 12:24 PM IST

హైద్రాబాద్ లో డీఏవీ స్కూల్ లో చిన్నారులపై  లైంగిక దాడికి పాల్పడిన  డ్రైవర్  రజనికుమార్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది  నాంపల్లి  కోర్టు. 


హైదరాబాద్: నగరంలోని  బంజారాహిల్స్ డీఏవీ  స్కూల్ లో  చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన  కేసులో డ్రైవర్  రజనికుమార్ కుమార్ కు  నాంపల్లి  ఫాస్ట్ ట్రాక్  కోర్టు  20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ  మంగళవారంనాడు తీర్పును వెల్లడించింది.

2022  అక్టోబర్ 16వ తేదీన  బంజారాహిల్స్  డీఏవీ  స్కూల్  లో  చిన్నారులపై  రజనీకుమార్ లైంగిక దాడికి పాల్పడిన  విషయమై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై  రజనికుమార్ లైంగిక దాడికి పాల్పడినట్టుగా  బాధిత కుటుంబం పోలీసులకు  ఫిర్యాదు  చేసింది.  బాధిత విద్యార్దిని  పేరేంట్స్  రజనికుమార్ పై  స్కూల్లోనే దాడికి దిగారు

Latest Videos

డిఎవీ స్కూల్  ప్రిన్సిపాల్  కారు డ్రైవర్ గా  రజనికుమార్ పనిచేస్తున్నాడు.  స్కూల్ ఆవరణలోని  ఓ గదిలోకి చిన్నారులను తీసుకెళ్లి వారిపై  నిందితుడు  లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్ లోని పలువురు  విద్యార్ధులపై   రజనికుమార్ పాల్పడ్డారని  ఆరోపణలున్నాయి.  ఈ విషయమై  విద్యార్ధుల  పేరేంట్స్, విద్యార్ధి సంఘాలు  పెద్ద ఎత్తున  ఆందోళనలు నిర్వహించారు. . ఈ ఘటన  నేపథ్యంలో  స్కూల్ గుర్తింపును  కూడా  రద్దు  చేసింది  ప్రభుత్వం.

ఈ స్కూల్లో  చదివే విద్యార్ధులను  ఇతర స్కూళ్లలో చదివించేలా  ఏర్పాట్లు  చేయాలని  విద్యాశాఖ అధికారులను  విద్యాశఆఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆదేశించారు.  అయితే   విద్యాసంవత్సరం  మధ్యలో స్కూల్  గుర్తింపుపై  విద్యార్ధుల పేరేంట్స్ ఆందోళనకు దిగారు.దీంతో  ఈ  స్కూల్  గుర్తింపును  గత  ఏడాది నవంబర్ మాసంలో    ప్రభుత్వం పునరుద్దరించింది.  ఇదిలా ఉంటే  డీఏవీ  స్కూల్  కొత్త మేనేజ్ మెంట్  చేతుల్లోకి వెళ్లింది.

విద్యార్ధులపై లైంగిక  దాడికి పాల్పడిన  అంశంపై  పోలీసులు  దర్యాప్తును  వేగంగా  పూర్తి  చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు కూడా  అంతే త్వరగా  విచారణను  పూర్తి  చేసి  ఇవాళ తుది తీర్పును  ఇచ్చింది. నాలుగు మాసాల వ్యవధిలోనే   ఈ కేసుపై  కోర్టు తుది తీర్పు వచ్చింది.  

click me!