
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో తనకు మసీదులో ఓ తాయత్తు కట్టారని, దాని వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని కేసీ ఓఏ క్లబ్ లో డాక్టర్ జీఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసి అనంతరం మాట్లాడారు.
ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుదాం - రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్
తాను చిన్నతనంలో అనారోగ్యం పాలయ్యారని, వైద్యులు కూడా ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారని తెలిపారు. అయితే కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ లో తనకు తాయత్తు కట్టారని చెప్పారు. దాని మహిమ వల్లే తాను బతికానని, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. కొత్తగూడెంలో కొత్తగా ఈద్గాలు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా.. హెల్త్ డైరెక్ట్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటి సారి కాదు.. గతేడాది డిసెంబర్ లో ఆయన కరోనాపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. దేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమన్నారు. ఏసుక్రీస్తు దయతో కరోనా నుంచి విముక్తి పొందామని, తమ సేవల వల్ల కాదని వ్యాఖ్యానించారు. ఆధునిక విద్య, ఆధునిక వైద్యం, ఆధునిక సంస్కృతిని ఎవరు తీసుకొచ్చినా క్రైస్తవం లేకుంటే భారతదేశం ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెందేది కాదని తెలిపారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
విషాదం.. రైస్ మిల్ బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది..? ఎక్కడంటే ?
ఇక, దాని కంటే ముందు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించిన పూజల్లో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తనను తాను దేవతగా చెప్పుకుంటున్న సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి పూజల్లో పాల్గొన్న శ్రీనివాసరావు.. మంటల్లో నిమ్మకాయులు వేస్తున్న వీడియో కూడా బయటకువచ్చింది. ఆయన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. ఈ విషయం బయటకు రావడంతో డీహెచ్ శ్రీనివాస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను గిరిజన పూజలు మాత్రమే చేశానని డీహెచ్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. తాను మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని చెప్పారు.