విక్రమ్ గౌడ్ ఇక జైలుకే

First Published Aug 3, 2017, 5:21 PM IST
Highlights
  • 14 రోజులు రిమాండుకు  విధించిన  నాంపల్లి కోర్టు
  • ఏ1 గా విక్రమ్ ఉన్నందున బెయిల్ పిటిషన్ కు నో చెప్పిన కోర్టు

 
అతితెలివికి పోయి అనర్థాలను కొనితెచ్చుకున్న విక్రమ్ గౌడ్ జైలుకు   చేరిండు. ఇరువైపుల వాదనలు విన్న  న్యాయమూర్తి విక్రమ్ ను 14 రోజులు రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. బుల్లెట్ గాయాలు ఇంకా నయం కాలేదు కావున మెరుగైన వైద్యం కోసం గాంధీలో కానీ ఉస్మానియా లో చికిత్స అందించాలని జైలు అధికారులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.
కేసులో చిక్కుముళ్లు విప్పడానికి ఏ1 నిందితునిగా ఉన్న విక్రమ్ ను కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు మెజిస్ట్రేట్ ను కోరారు. అయితే గాయాల నుంచి ఇంకా కోలుకోలేడు కావున బెయిల్ ను మంజూరు చేయాలని విక్రమ్ తరపు న్యాయవాది కోరారు. ఇంకా గాయాల తీవ్రత అధికంగా ఉంది కావున మెరుగైన వైద్యం  అందిచాల్సి ఉన్నందున రిమాండుకు  వ్యతిరేకంగా బెయిల్ పిటిషన్ సమర్పించినట్లు విక్రమ్ న్యాయవాది తెలిపారు.
ప్రధాన నిందితునిగా ఉన్నందున విక్రమ్ కు బెయిల్ మంజూరు చేయడం కుదరదని, అయితే మెరుగైన వైద్యం అందించడానికి జైళ్ల శాఖను ఆదేశిస్తున్నట్లు నాంపల్లి 3వ మేజిస్ట్రేట్  ఆదేశాలు జారీ చేశారు.రాత్రి వరకు విక్రమ్ ను ఉస్మానియాకో, గాంధికో తరలించడానికి జైలు సూపరిండెంట్ నిర్ణయం తీసుకోనున్నారు.తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగుందనుకుంటే జైలుకు తరలించనున్నారు.
 

click me!