
చట్టాలను పాటించమని చెప్పేవారే చట్టాలను ఉళ్లంగిస్తున్న సంఘటన ఇది. ఇటీవలే ట్రాపిక్ రూల్స్ ని కఠినతరం చేసిన పోలీసులు పాయింట్ విదానాన్ని ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ రూల్స్ ఉళ్లంగించిన వారికి ఈ పాయింట్లను కేటాయించి, 12 పాయింట్లు పోందిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దుచేసే నియమాన్ని ఇటీవల పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఈ నియమాలన్ని సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి, తమకు అవసరం లేదు అన్నట్లుగా ఉంది పోలీసుల వ్యవహారం. పై పోటోను చూస్తే అర్థమవుతుంది వారికి ట్రాఫిక్ నియమాలపై ఎంత నిబద్దత ఉందో. తాము రూపొందించిన నియమాలే కదా అనుకున్నారో ఏమో ఇలా బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అదీ రాంగ్ రూట్ లో వెళుతూ.
వీరికి కూడా రూల్స్ ప్రకారం ట్రాపిక్ పాయింట్లు వేస్తారా, లేక తమవారే కదా రూల్స్ గీల్స్ నై చల్తా అంటారా చూడాలి మరి.