నల్గొండ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Mar 13, 2024, 7:39 PM IST

రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సురవరం సుధాకర్ రెడ్డి , మల్లు స్వరాజ్యం, చకిలం లలితా దేవి, కే జానారెడ్డి వంటి కాకలు తీరిన నేతలను దేశానికి అందించిన గడ్డ నల్గొండ. తెలంగాణ సాయుధ పోరాటం , తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సహా ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన గడ్డ. 1952లో ఏర్పడిన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం తొలి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట. కామ్రేడ్లు ఇక్కడ 7 సార్లు, కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ రెండు సార్లు , ఇతరులు ఒకసారి విజయం సాధించారు. పార్టీ ఏదైనా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. 2009తో పాటు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచినా 2014, 2019 ఎన్నికల్లోనూ హస్తం పార్టీయే ఇక్కడ గెలిచింది. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మారింది.


రాజకీయ చైతన్యానికి కేంద్రం.. ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు పురిటి గడ్డ నల్గొండ. తెలంగాణ సాయుధ పోరాటం , తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సహా ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన గడ్డ. కాకలు తీరిన రాజకీయ యోధులకు నల్గొండ పుట్టినిల్లు. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఎన్నో విప్లవోద్యమాలకు కేంద్రంగా నిలిచింది. రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సురవరం సుధాకర్ రెడ్డి , మల్లు స్వరాజ్యం, చకిలం లలితా దేవి, కే జానారెడ్డి వంటి కాకలు తీరిన నేతలను దేశానికి అందించిన గడ్డ నల్గొండ. ఇక్కడ రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టం. ఆధునిక దేవాలయంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించిన నాగార్జున సాగర్ డ్యామ్ నల్గొండ పరిధిలోనే వుంది. 

నల్గొండ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కమ్యూనిస్టుల కంచుకోట :

Latest Videos

1952లో ఏర్పడిన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం తొలి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట. కామ్రేడ్లు ఇక్కడ 7 సార్లు, కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ రెండు సార్లు , ఇతరులు ఒకసారి విజయం సాధించారు. పార్టీ ఏదైనా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. నల్గొండ లోక్‌సభ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ స్థానాలున్నాయి. 

నల్గొండ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,85,980 మంది. వీరిలో పురుషులు 8,01,320 మంది.. మహిళలు 7,84,633 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 11,75,703 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 74.13 శాతం పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించగా.. బీఆర్ఎస్ ఒక చోట గెలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 5,26,028 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహారెడ్డికి 5,00,346 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ 25,682 ఓట్ల తేడాతో నల్గొండను కైవసం చేసుకుంది. 

నల్గొండ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌ దూకుడు :

కాంగ్రెస్‌కు నల్గొండ కంచుకోట. 2009తో పాటు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచినా 2014, 2019 ఎన్నికల్లోనూ హస్తం పార్టీయే ఇక్కడ గెలిచింది. తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్రనేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు ఇక్కడికి చెందినవారే కావడంతో పాటు బలమైన రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్‌కు అండగా వుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ నల్గొండ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. దీంతో నల్గొండ టికెట్ తెచ్చుకుంటే గెలుపు గ్యారంటీ అని నేతలు ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో టికెట్ కోసం పోటీ పెరిగిపోతోంది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, శంకర్ నాయక్, గుమ్మల మోహన్ రెడ్డిలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మారింది. కేసీఆర్ వ్యూహాలు కానీ, తెలంగాణ సెంటిమెంట్ కానీ ఇక్కడ పనిచేయడం లేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో స్థానికంగా వున్న బీఆర్ఎస్ కేడర్ కూడా చేజారిపోతోంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఖరారు చేసింది. అయితే ఆయన రాకను పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. సైదిరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. 
 

click me!