నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి. రామేశ్వరరావు, ఏఆర్ మల్లు, మందా జగన్నాథం, నంది ఎల్లయ్య వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. టీడీపీలో నెంబర్ 2గా వెలిగిన నాగం జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూలుకు చెందిన వారే. గద్వాల్ సంస్థానం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, విస్తారమైన నల్లమల అటవీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ నాలుగు సార్లు , బీఆర్ఎస్ , ఇతరులు ఒక్కోసారి నాగర్ కర్నూల్‌లో విజయం సాధించారు. అన్నాదమ్ములైన ఏఆర్ మల్లు, మల్లు రవిలు ఇక్కడ రెండేసి సార్లు ఎంపీలుగా గెలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్‌పై కన్నేసింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఒప్పప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండేది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నేతలే ఆధిపత్యం చెలాయించేవారు. తెలంగాణలో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు ఒకటి. రామేశ్వరరావు, ఏఆర్ మల్లు, మందా జగన్నాథం, నంది ఎల్లయ్య వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
టీడీపీలో నెంబర్ 2గా వెలిగిన నాగం జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూలుకు చెందిన వారే. నాగర్ కర్నూల్‌లో వెయ్యేళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లున్నాయి. పశ్చిమ చాళుక్యుల నుంచి నిజాం వరకు ఎన్నో రాజవంశాలు ఇక్కడ పాలన సాగించినట్లుగా తెలుస్తోంది. గద్వాల్ సంస్థానం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, విస్తారమైన నల్లమల అటవీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
undefined
నాగర్ కర్నూల్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట :
నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి. 1962లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నాగర్ కర్నూలు కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పాతింది. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ నాలుగు సార్లు , బీఆర్ఎస్ , ఇతరులు ఒక్కోసారి నాగర్ కర్నూల్‌లో విజయం సాధించారు. అన్నాదమ్ములైన ఏఆర్ మల్లు, మల్లు రవిలు ఇక్కడ రెండేసి సార్లు ఎంపీలుగా గెలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,88,111 మంది. వీరిలో పురుషులు 7,89,581 మంది.. మహిళలు 7,98,491 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9,89,847 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 62.33 శాతం పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్ 5 చోట్ల, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి పోతుగంటి రాములుకు 4,99,672 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవికి 3,09,924 ఓట్లు .. బీజేపీ అభ్యర్ధి శృతి బంగారుకు 1,29,021 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 1,89,748 ఓట్ల తేడాతో నాగర్ కర్నూలును కైవసం చేసుకుంది.
నాగర్ కర్నూల్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో దిగెదెవరు :
తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్‌పై కన్నేసింది. ఇక్కడ ఆ పార్టీ గెలిచి 15 ఏళ్లు కావొస్తోంది. 2009లో చివరిసారిగా మందా జగన్నాథం విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూలులో విక్టరీ కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో వుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్ధితులు కూడా అనుకూలంగా వుండటంతో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లి కూడా నాగర్ కర్నూలు పరిధిలోకి వస్తుండటం కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ టికెట్ కోసం కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య పోరు నడుస్తోంది. మరి వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి. బీజేపీ నాగర్ కర్నూలు టికెట్‌ను భరత్ రెడ్డికి కేటాయించింది. దీంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
బీఆర్ఎస్ విషయానికి వస్తే.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని కేసీఆర్ కృతనిశ్చయంతో వున్నారు. బీఆర్ఎస్, బీఎస్పీల మధ్య పొత్తు కుదరడంతో నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఐపీఎస్, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధిలోని ఆలంపూర్ ఆయన స్వస్థలం కావడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరగా.. ఆయన కుమారుడు భరత్‌కు టికెట్ కేటాయించింది. దీంతో ప్రవీణ్ కుమార్‌కు ఎదురులేదనే వాదన వినిపిస్తోంది.