ఉద్ధండులైన ఎస్ జైపాల్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు, ఏపీ జితేందర్ రెడ్డి, మల్లిఖార్జున్ గౌడ్, రామేశ్వరరావు వంటి వారిని పార్లమెంట్‌కు పంపిన గడ్డ పాలమూరు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులకు ఈ నియోజకవర్గం నెలవు. రాయలసీమను, కర్ణాటకను ఆనుకుని వుండే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటాయి. దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే మహబూబ్‌నగర్ జిల్లా కీలకమనే సెంటిమెంట్ దశాబ్ధాలుగా వుంది. కాంగ్రెస్ , తెలంగాణ ప్రజాసమితి, జనతా పార్టీ, జనతాదళ్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఇక్కడి నుంచి గెలిచాయి. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలదే తొలి నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కాంగ్రెస్ పదిసార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ ఒకసారి, ఇతరులు మూడుసార్లు పాలమూరు నుంచి గెలిచారు.
రాయలసీమను, కర్ణాటకను ఆనుకుని వుండే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటాయి. దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే మహబూబ్‌నగర్ జిల్లా కీలకమనే సెంటిమెంట్ దశాబ్ధాలుగా వుంది. అన్ని పార్టీలు ఇందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. వలసలు, కరువే కాదు.. విభిన్న రాజకీయాలకు పాలమూరు కేరాఫ్‌గా కొనసాగుతోంది. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా నీటి కోసం ఇక్కడి ప్రజలు విలవిలలాడుతూ.. పొట్ట చేతపట్టుకుని ఎక్కడికో వలసపోతుంటారు. ఉద్ధండులైన ఎస్ జైపాల్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు, ఏపీ జితేందర్ రెడ్డి, మల్లిఖార్జున్ గౌడ్, రామేశ్వరరావు వంటి వారిని పార్లమెంట్‌కు పంపిన గడ్డ పాలమూరు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులకు ఈ నియోజకవర్గం నెలవు.
మహబూబ్‌నగర్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఉద్ధండులకు పుట్టినిల్లు :
కాంగ్రెస్ , తెలంగాణ ప్రజాసమితి, జనతా పార్టీ, జనతాదళ్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఇక్కడి నుంచి గెలిచాయి. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలదే తొలి నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట. 1952లో ఈ స్థానం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పదిసార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ ఒకసారి, ఇతరులు మూడుసార్లు పాలమూరు నుంచి గెలిచారు.
రాష్ట్ర విభజన తర్వాత ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ గ్రిప్‌లోకి వెళ్లింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కొడంగల్, నారాయణ పేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 శాసనసభ స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,06,102 మంది. వీరిలో 7,53,957 మంది పురుషులు.. మహిళలు 7,52,106 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 9,84,634 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 65.38 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి మన్నే శ్రీనివాస్ రెడ్డికి 4,11,402 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి డీకే అరుణకి 3,33,573 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి చల్లా వంశీ చంద్ రెడ్డికి 1,93,631 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 77,829 ఓట్ల మెజారిటీతో మహబూబ్‌నగర్‌ను కైవసం చేసుకుంది.
దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలమూరుపై కన్నేసింది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. చివరిసారిగా 2004లో కాంగ్రెస్ మహబూబ్‌నగర్‌లో విజయం సాధించింది. ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా వుండటంతో కాస్త కష్టపడితే చాలు విజయం తథ్యమనే అభిప్రాయం నేతల్లో వుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన చల్లా వంశీ చంద్ రెడ్డిని కాంగ్రెస్ మరోసారి అభ్యర్ధిగా ప్రకటించింది. మరోవైపు తన కంచుకోటను కోల్పోరాదని బీఆర్ఎస్ సైతం కృతనిశ్చయంతో వుంది. సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు కేసీఆర్. ఇక తేలాల్సింది బీజేపీ సంగతే.
మహబూబ్‌నగర్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బీఆర్ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్ పోటీ ఇవ్వగలవా :
మహబూబ్‌నగర్‌లో సంఘ్ పరివార్, జనసంఘ్, జనతాదళ్ మూలాలు బలంగా వున్నాయి. గతంలో జనతా పార్టీ, జనతాదళ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జితేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆయనకు నియోజకవర్గంలో బలమైన అనుచరగణం వుంది. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ కూడా టికెట్ రేసులో వున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో చూడాలి.