ఈ నల్లగొండ మహిళలు పోలీసులకే షాక్ ఇచ్చారు (వీడియో)

Published : Jan 25, 2018, 07:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఈ నల్లగొండ మహిళలు పోలీసులకే షాక్ ఇచ్చారు (వీడియో)

సారాంశం

పోలీసు స్టేసన్ లోనే సెల్ టవర్ ఎక్కిన లంబాడీ యువకులు సర్పంచ్ కాళ్లు మొక్కించారని యువకుల మనస్థాపం స్టేషన్ ను ముట్టడించి పోలీసులను ఘెరావ్ చేసిన తండావాసులు

నల్లగొండ జిల్లాలోని ఆ గ్రామం ఒక మారుమూల పల్లెటూరు. అదొక తాండా. ఆ తండావాసులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో వారంతా ఏకమై పోలీసు స్టేషన్ లోనే ధర్నాకు దిగి పోలీసులకు చుక్కలు చూపించారు. ఎందుకు జరిగిందో చదవండి. వారి గట్స్ ను వీడియోలో చూడండి.

మునుగోడు నియోజవర్గంలోని నాంపల్లి మండంలోని పసునూరి గ్రామానికి అనుబంధ తండా నామనాయక్ తండా. ఈ గ్రామంలోని ఇద్దరు యువకులు కళ్యాణ్ నాయక్, భిచ్యా నాయక్ లకు గ్రామ సర్పంచ్ పోగుల వెంకటరెడ్డితో వివాదం ఏర్పడింది. దీంతో వారిపై సర్పంచ్ నాంపల్లి పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే పోలీసులు ఆ ఇద్దరు యువకులను స్టేషన్ కు పట్టుకొచ్చారు. ఇక స్టేషన్ లో పడేసి తమను పొట్టు పొట్టుగా కొడతారన్న భయంతో ఆ ఇద్దరు యువకులు నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఉన్న సెల్ టవర్ ఎక్కారు.

అయితే అంతలో తండావాసులంతా తండోపతండాలుగా స్టేషన్ కు వచ్చి ఆందోళనకు దిగారు. స్టేషన్ లోనే పోలీసులను ఘెరావ్ చేశారు. వారి నినాదాలు, ఆందోళనతో పోలీసు స్టేషన్ పరిసరాలన్నీ మారుమ్రోగాయి. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి సర్పంచ్ బంధువుని లంబాడీ యువకులు చెబుతున్నారు. తండా మహిళలు, యువత ఎలా పోలీసులపై తిరుగుబాటు చేశారో కింద వీడియోలో చూడవచ్చు. అయితే ఈ వివాదం వెనుక మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆ ఇద్దరు లంబాడీ యువకుల చేత సర్పంచ్ కాళ్లు మొక్కించారని ప్రచారం సాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Ameerpet Fire: అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంఅసలు కారణాలు ఇవే వెల్లడించిన అధికారులు| Asianet News Telugu
పాతబస్తీలో కేటీఆర్ సందడి..Osmania Biscuits in Old City Hyd | KTR Charminar Visit | Asianet Telugu