కేసిఆర్ నా సీటుకే ఎసరు పెట్టిండు

First Published Jan 25, 2018, 5:45 PM IST
Highlights
  • ఉద్యమ కేసిఆర్ వేరు ఇప్పటి కేసిఆర్ వేరు
  • ఆయన ఇలా చేస్తానడి నేను అస్సలు ఊహించలేదు
  • కేసిఆర్ ఏదీ సీరియస్ గా తీసుకోడు
  • చిరంజీవికే దిక్కులేదు పవన్ ను ఎవరు పట్టించుకుంటారు

తెలంగాణ సిఎం కేసిఆర్ పై మాజీ ఎంపి, మాజీ సినీ నటి ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి ఇత్తడి తెలంగాణ చేసిండని మండిపడ్డారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆమె ఇంకా ఏమన్నారో చదవండి.

అతి త్వరలో రాజకీయంగా యాక్టివ్ అవుతా. కావాలనే కొంతకాలం గ్యాప్ తీసుకున్నా. హైకమాండ్ తో టచ్ లో ఉన్నా. నా పాత్ర ఏంటనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. పార్టీ అధికారంలోకి రావాలన్నదే నా ఆలోచన. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దనే అనుకుంటున్నా. ఒక నియోజకవర్గానికి పరిమితం అవ్వాలని లేదు. కానీ రాహుల్ గాంధీ పోటీ చేయాలని అన్నారు. ఇంకా సమయం ఉంది...ఆలోచిద్దాం.

మందకృష్ణ, కోదండ రాం మరెవరి విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వం తీరు సరిగా లేదు. ఉద్యమం చేసి వచ్చిన కేసీఆర్ కూడా ఇలా చేయడం బాధాకరం. గవర్నర్ కాదు...కేసీఆర్ పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. కేసీఆర్ ఇలా వ్యవహరిస్తారని నేను అస్సలు ఊహించలేదు. తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారిని వేధిస్తున్నారు. కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. తప్పులు దిద్దుకుంటే మంచిది.

కేసీఆర్ ఏదీ సీరియస్ గా తీసుకోరు. బంగారు కాదు...ఇత్తడి తెలంగాణలా ఉంది. ఉద్యమ కేసీఆర్ వేరు...ఇప్పుడున్న కేసీఆర్ వేరు. 20 ఏళ్ల రాజకీయంలో అవమానాలు, వెన్నుపోట్లు అన్నీ చూశాను. తెలంగాణ సాధనే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన అంశం. అయినా..పొలిటికల్ కెరీర్ సంతృప్తినిచ్చింది. జయశంకర్ సార్ చెప్పడం వల్లే పార్టీ విలీనం చేశాను. అంతకంటే ముందు కేసీఆర్ కూడా చాలాసార్లు అడిగారు. 2009లో నా సీటుకే కేసీఆర్ ఎసరు పెట్టారు. అందరూ చెప్పాక మనసు మార్చుకున్నారు.

అన్న చిరంజీవిని చూశాం ఆయనకే దిక్కులేదు. ఇప్పుడు పవన్ ని చూస్తున్నాం. అన్న లానే తమ్ముడు వ్యవహారం కూడా కనబడుతున్నది. అయినా పవన్ కు రెండు కళ్ళ సిద్దాంతం కుదరదు. ఎదో ఒక రాష్ట్రం ఎంచుకోవాలి. స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం చేస్తే సంతోషిస్తాం.

click me!