Nagarjuna Sagar: నాగార్జున సాగ‌ర్ వివాదం.. ఏపీ అధికారుల‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ

By Mahesh Rajamoni  |  First Published Nov 30, 2023, 10:58 AM IST

Nagarjuna Sagar: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే, న‌ది జ‌లాలు, విద్యుత్ పంపిణీ విష‌యంలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య గ‌త కొంత కాలంగా వివాదం న‌డుస్తోంది.
 


Nagarjuna Sagar controversy: నాగార్జునసాగర్ నీటి ప్రాజెక్టు వ‌ద్ద ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బుధ‌వారం రాత్రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారులు భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ అక్ర‌మ చోర‌బాటును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టులోని 13 గేట్ల‌ను త‌మ అధినంలోకి తీసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు నీటి విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. నాగార్జున సాగ‌ర్ కుడి కాలువ‌కు నీరు  విడుద‌ల చేయ‌డానికి సిద్ధమ‌య్యారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ అధికారులు ఏపీ అధికారుల‌కు షాక్ ఇచ్చారు. నీటి విడుద‌ల చేయ‌డానికి ఏపీ పోలీసులు ప్ర‌య‌త్నించ‌డంతో.. వెంట‌నే తెలంగాణ అధికారులు క‌రెంట్ స‌ర‌ఫ‌రాను క‌ట్ చేశాడు. మోట‌ర్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో నీటి విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది.

Latest Videos

అయితే, వెన‌క్కి త‌గ్గ‌ని ఏపీ అధికారులు ఎలాగైనా నీటిని విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మోట‌ర్ల‌కు క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేయ‌డానికి  ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఏం  జ‌రుగుతుందోన‌ని స్థానికంగా ఉద్రిక్త వాతావ‌ర‌ణ నెల‌కొంది. రాత్రి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఏపీ పోలీసులు.. డ్యామ్ పై ముళ్ల‌కంచెను ఏర్పాటు చేయ‌డంతో పాటు అక్క‌డున్న సీసీ కెమెరాల‌ను ధ్వంసం చేశారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను ధ్వ‌సం చేశారు.

click me!