కారణమిదీ: ప్రగతి భవన్ వద్ద సూర్యాపేట జిల్లాకు చెందిన నాగరజు ఆత్మహత్యాయత్నం

Published : Aug 11, 2022, 05:01 PM ISTUpdated : Aug 11, 2022, 05:27 PM IST
 కారణమిదీ: ప్రగతి భవన్ వద్ద సూర్యాపేట జిల్లాకు చెందిన నాగరజు ఆత్మహత్యాయత్నం

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని ప్రగతి భవన్ వద్ద సూర్యాపేట జిల్లాకు చెందిన  పిడమర్తి నాగరాజు ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

హైదరాబాద్:  ప్రగతి భవన్ వద్ద గురువారం నాడు మధ్యాహ్నం నాగరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడం లేదని ఆరోపిస్తూ నాగరాజు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి చెందిన  నాగరాజు  సూర్యాపేట జిల్లాకు చెందినవాడుగా పోలీసులు చెప్పారు. ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన  నాగరాజును పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రగతి భవన్ వద్ద నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే పోలీసులు వెంటనే నాగరాజు చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ను  లాక్కొన్నారు. పిడమర్తి నాగరాజును పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.గతంలో కూడ  ప్రగతి భవన్ ముందు  ఈ తరహాలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. తతమ డిమాండ్ల సాధన కోసం ప్రగతి భవన్  ముందు ఆత్మహత్యాయత్నాలు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?