హైదరాబాద్‌లో దారుణం.. బర్త్ డే రోజున ఇంటికి వచ్చి బ్యూటీషియన్‌పై అత్యాచారం..!

Published : Aug 11, 2022, 04:45 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. బర్త్ డే రోజున ఇంటికి వచ్చి బ్యూటీషియన్‌పై అత్యాచారం..!

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్‌పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు బ్యూటీషియన్ జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్‌పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు బ్యూటీషియన్ జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. బాధిత మహిళ కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ప్రస్తుతం గాజులరామారాంలో నివాసం ఉంటుంది. బ్యూటీషియన్‌గా పనిచేస్తుంది. అయితే మహిళకు సంజీవ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే బ్యూటీపార్లర్ పెడదామని ప్రయత్నాల్లో ఉన్నా మహిళకు.. సంజీవ్ రెడ్డి సాయం చేస్తానని చెప్పాడు. బ్యూటీపార్లర్ పెట్టిస్తానని నమ్మబలికాడు. 

ఈ క్రమంలోనే మహిళ బర్త్ డే సందర్భంగా సంజీవ్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. తన ఇంటికి వచ్చిన సంజీవ్ రెడ్డి.. తనపై అత్యాచారాం చేశాడని మహిళ ఆరోపించింది. ఇదే విషయాన్ని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంజీవ్ రెడ్డి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మిర్చి బాబాగా పిలవబడే బాబా వైరాగ్యానంద్ గిరిని మధ్యప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణలపై మిర్చి బాబాను అరెస్ట్ చేసినట్టుగా ఏఎన్‌ఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది. గ్వాలియర్‌లోని ఓ హోటల్‌ నుంచి బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి బాబాను అరెస్ట్ చేసేందుకు భోపాల్ పోలీసులు, గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. మిర్చి బాబాను అరెస్ట్ చేసిన తర్వాత భోపాల్ పోలీసులకు అప్పగించినట్టుగా గ్వాలియర్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘీ తెలిపారు.

మిర్చి బాబా తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మధ్య వయస్కురాలు సోమవారం సాయంత్రం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఆమె ఈ ఏడాది జూలైలో బాబాను కలిసింది. సంతానం కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి  బాబా వద్దకు వెళ్లింది. అయితే ఈ క్రమంలోనే బాబా మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక, మిర్చి బాబాపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశామని.. విచారణ జరుపుతున్నామని భోపాల్ ఏసీపీ నిధి సక్సేనా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?