కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆర్ జీ పాల్ అని పిలవండి: కాంగ్రెస్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 11, 2022, 4:43 PM IST
Highlights

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇక నుండి ఆర్ జీ పాల్ అని పిలవాలని టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఒకవేళ అలా పిలవకపోతే షోకాజ్ నోటీసును ఇస్తానని కూడా  రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇక నుండి ఆర్ జీ పాల్ అని పిలవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కోరారు.

గురువారంనాడు గాంధీభవన్ లో  కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  తదితరులు పాల్గొన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆర్ జీ పాల్ అని పిలవాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. రాజగోపాల్ రెడ్డిని ఆర్జీ పాల్ అని పిలవకపోతే  షోకాజ్ నోటీసులిస్తానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పా,రు. ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో ఆర్జీ పాల్  అంటూ రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

 కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి    ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా సోనియా గాంధీకి లేఖ పంపారు. ఈ నెల 8వ తేదీన  మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్పించిన రాజీనామాను తెలంగాాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం స్పీకర్ అదే రోజును ఆమోదించారు. మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఈసీకి సమాచారం పంపింది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ఆరు మాసాల్లో జరగనున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరనున్నారు.ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు. చౌటుప్పల్ లో నిర్వహించే సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు.ఈ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.

 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని  వీడిన సమయంలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు అదే స్థాయిలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  విమర్శలు చేశారు. 

click me!