శివకుమార్‌ది పరువు హత్యే... కూతురిని ప్రేమించాడని తమ్ముడితో కలిసి హత్య, నలుగురి అరెస్ట్

By Siva Kodati  |  First Published Oct 14, 2022, 2:59 PM IST

హైదరాబాద్‌లో వెలుగుచూసిన శివకుమార్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శివకుమార్‌‌ని అమీర్‌పేటలో హత్య చేసి మృతదేహాన్ని ముషీరాబాద్‌లోని మూసీనదిలో పడేశారు నిందితులు.
 


హైదరాబాద్‌లో వెలుగుచూసిన శివకుమార్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురిని ప్రేమించాడని తమ్ముడితో కలిసి హత్య చేయించాడు యువతి తండ్రి. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివకుమార్‌‌ని అమీర్‌పేటలో హత్య చేసి మృతదేహాన్ని ముషీరాబాద్‌లోని మూసీనదిలో పడేశారు నిందితులు. అయితే శివకుమార్ మృతదేహం ఇంకా లభించలేదు. 

వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన బాలస్వామి ఉపాధి కోసం కుటుంబంతో కలిసి పటాన్ చెరులో ఉంటున్నాడు. ఆయన కుమారుడు శివ కుమార్ కూలీ పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో యువకుడికి ముషీరాబాద్ కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. అలా తరచూ శివకుమార్ ముషీరాబాద్ కు వెళ్లి ఆమెను కలిసేవాడు. ఇది యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. శివకుమార్ ను చంపేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈనెల 7న మధ్యాహ్నం పథకం ప్రకారం యువతితో శివకుమార్ కు ఫోన్ చేయించారు. ఆమె శివకుమార్‌ను ముషీరాబాద్‌కు రావాలని పదేపదే కోరింది. యువతి కుటుంబ సభ్యులు కూడా అదే ఫోన్ ద్వారా శివకుమార్ తో మాట్లాడారు. ఒకసారి వచ్చి.. మాట్లాడి వెళ్లాల్సిందిగా నమ్మబలికారు. తన వద్ద డబ్బులు లేవని అతడు చెప్పగా.. యువతి ఫోన్ నుంచి 200 రూపాయలు గూగుల్ పే చేశారు.

Latest Videos

undefined

ALso REad:వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. రూ. 200 గూగుల్‌ పే చేసి, పిలిపించి హత్య !!

దీంతో శివకుమార్ అదే రోజు సాయంత్రం ముషీరాబాద్ కు వెళ్ళాడు. ఆ తర్వాత రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి శివకుమార్ కి ఫోన్ చేసింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి తాను ముషీరాబాద్‌లో ఉన్న యువతి వద్దకు వచ్చాను అని.. అతడు చెబుతుండగానే.. ఇంకొందరు శివకుమార్ సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కుని.. స్విచ్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత శివకుమార్ ఫోన్ మళ్లీ కలవలేదు. అంతను ఇంటికి రాలేదు. దీంతో మరుసటి రోజు శివకుమార్ తల్లిదండ్రులు యువతి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. 

తమ కొడుకు ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. అయితే, వారు మాత్రం అతను తమ వద్దకు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోక యువకుడి తల్లిదండ్రులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబ సభ్యులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా శివకుమార్ హత్యకు గురైనట్లుగా తెలిసింది. యువతీ యువకులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో అదృశ్యమైన రోజే శివకుమార్ ను దారుణంగా హత్య చేసి ముషీరాబాద్ పరిసరాల్లోని నాలాలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు. శివకుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నామని సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 

click me!