కేసీఆర్ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించే కుట్ర: బీజేపీపై గుత్తా సుఖేందర్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 14, 2022, 2:04 PM IST

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తారని తెలంగాణ శాసమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. 


నల్గొండ: కేసీఆర్ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా  సుఖేందర్  రెడ్డి ఆరోపించారు.

శుక్రవారం నాడు తెలంగాణశాసనమండలి చైర్మెన్ గుత్తా  సుఖేంద్ రెడ్డి  నల్గొండలో మీడియాతో మాట్లాడారు.  రాజకీయాల్లో ఈ రకమైన పద్దతి మంచిదికాదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ ఒత్తిడితోనే కోమటిరెడ్డి రాజగోపాాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని సుఖేందర్ రెడ్డి విమర్శించారు.

Latest Videos

మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడుఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేశారు.దీంతో ఈ  ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే  కోమటిరెడ్డి రాజ.గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  అదే నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి,టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరు దఫాలు కాంగ్రెస్, ఐదు దఫాలు సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు.ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపొందారు. వచ్చేనెల 3న జరిగే ఉప ఎన్నికల్లో  విజయం ఎవరిని వరించనుందో  22 రోజుల తర్వాత తేలనుంది. 



 

click me!