ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది. దీంతో మూసీ పరివాహకప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల మూసీకి వరదపోటెత్తింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. హైద్రాబాద్ నగరంలోని జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జంట జలాశయాల నుండి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నీరు మూసీలోకి ప్రవహిస్తుంది. జంట జలాశయాల నుండి 6 వేల క్యూసెక్కుల నీరు మూసీలో వచ్చిచేరుతుంది. దీంతో మూసీలో క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది.
హిమాయత్ సాగర్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారుపోలీసులు. నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.హైద్రాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో జంట జలాశయాల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరుమూసీలోకి వచ్చి చేరుతుంది. దీంతో మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా జంట జలాశయాల గేట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 09 తేదీన ఎత్తారు. ఈఏడాది నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిశాయి., రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నగర ప్రజలకు నరకం చూపుతుంది. ప్రతి రోజూ సాయంత్రం నుండి అర్ధరాాత్రి వరకు వర్షం కురుస్తుంది. నాలుగైదు రోజులుగా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలుజారీ చేసింది.