ల్యాండ్ డీల్.. రేపు రిజిస్ట్రేషన్: మాట్లాడాలని పిలిచి తల్వార్‌తో ఎటాక్.. స్థానికులు చూడటంతో

Siva Kodati |  
Published : Jun 21, 2021, 05:08 PM IST
ల్యాండ్ డీల్.. రేపు రిజిస్ట్రేషన్: మాట్లాడాలని పిలిచి తల్వార్‌తో ఎటాక్.. స్థానికులు చూడటంతో

సారాంశం

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ గొడవలతో ఒక వ్యక్తిని ప్రత్యర్ధులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ గొడవలతో ఒక వ్యక్తిని ప్రత్యర్ధులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోలి  శ్రీకాంత్.. మల్కాపూర్‌కు చెందిన మారుతి వద్ద భూమి కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 20 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. రేపు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా మాట్లాడేందుకు రావాల్సిందిగా మారుతి పిలిచాడు.

Also Read:పొలం గొడవ : మాట్లాడుకుందామని పిలిచి.. తండ్రి, ఇద్దరు కొడుకుల దారుణహత్య

ఈ నేపథ్యంలో అతని వద్దకు వెళ్లిన బాధితుడిపై హత్యాయత్నం జరిగింది. రక్తపుమడుగులో పడివున్న శ్రీకాంత్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!