:కరోనాపై ప్రజలను భయోతాత్పం చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను కోరారు. వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధుల విషయంలో మీడియాలో వస్తున్న ప్రచారంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారన్నారు. పాజటివ్ దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. సమాజం పట్ల బాధ్యతా వ్యవహరించాలని ఆయన మీడియాను కోరారు.
అమరావతి:కరోనాపై ప్రజలను భయోతాత్పం చేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను కోరారు. వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధుల విషయంలో మీడియాలో వస్తున్న ప్రచారంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారన్నారు. పాజటివ్ దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. సమాజం పట్ల బాధ్యతా వ్యవహరించాలని ఆయన మీడియాను కోరారు.
also read:ఆ రెండు మందు బిళ్లలతో కరోనా నుండి బయటపడ్డా: కేసీఆర్
మాస్కు పెట్టుకోవాలని ప్రచారం చేయాలన్నారు. మీడియా ప్రచారం చూసి కూడ కొందరు చనిపోయారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రధాని మోడీ తనతో చర్చించారని చెప్పారు. అవసరం లేకున్నా కూడ ఆక్సిజన్ తో పాటు కరోనా మందులను కొనుగోలు చేసిన సందర్భాలను ఆయన ఉదహరించారు. ముంబై కమిషనర్ బ్లాక్ లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను బయటకు తీసి అవసరమైన రోగులకు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కాకముందుగానే ఏ రోజైనా ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, నీలోఫర్ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయా అని ప్రశ్నించారు. వైద్య రంగంపై దాడి సరైంది కాదని చెప్పారు. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేశారన్నారు. కరోనా సమయంలో రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులకు చేతులు జోడించి సెల్యూట్ చేస్తున్నానని ఆయన చెప్పారు.కరోనాపై హెల్త్, పోలీస్ శాఖలు అద్బుతంగా పనిచేశాయని ఆయన అభినందించారు.