జూలై 1 నుండి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.
వరంగల్: జూలై 1 నుండి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. ఈ విషయమై ఈ నెల 26వ తేదీన హైద్రాబాద్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టుగా సీఎం చెప్పారు.
also read:కరోనాపై దుష్ప్రచారం వద్దు: మీడియాకు కేసీఆర్ చురకలు
ఈ సమావేశంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి ప్లాన్ రూపొందిస్తామన్నారు. స్థానిక సంస్థలకు జూలై మాసం నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు.పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరిత హరం కార్యక్రమాలను కలిపి నిర్వహిస్తామన్నారు. వరంగల్ జిల్లాలో పుట్టిన జయశంకర్ గురించి ఈ సమావేశంలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు.
జయశంకర్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జయశంకర్ బతికి ఉంటే బాగుండేందన్నారు. తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో జయశంకర్ పాత్ర గురించి ఆయన ప్రస్తావించారు.