కేటిఆర్ కు మస్త్ కోపమొచ్చింది

Published : Oct 28, 2017, 06:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కేటిఆర్ కు మస్త్ కోపమొచ్చింది

సారాంశం

కార్పొరేటర్లపై కేటిఆర్ సీరియస్ ఎక్కవ చేస్తే సస్పెండ్  చేస్తా అధికారులను ఏమనొద్దు

తెలంగాణ సిఎం కేసిఆర్ కొడుకు, రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కేటిఆర్ కు మస్తు కోపమొచ్చింది. కార్యకర్తల మీద ఆయన మస్త్ గరం గరం అయిండు. ఇంతకూ ఆయనకు ఎందుకు కోపమొచ్చింది? ఎవరి మీద కోపమొచ్చింది అనేగా మీ డౌట్ అయితే ఈ వార్త చదవురి మరి.

హైదరాబాద్ కార్పొరేటర్ పని తీరు పట్ల కేటిఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో చాలా మంది కార్పొరేటర్లను కడిగి పారేసిండు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చిండు మంత్రి కేటిఆర్. చైతన్యపురి ఏమైనా నీ సామ్రాజ్యమా అనుకుంటన్నవా? అని మందలించిండు. అధికారులు మీ డివిజన్ లో తిరగాలి అంటే.. నీ అనుమతి తీసుకోవాలా..? అని నిలదీశిండు. ఎక్కువ తక్కువ చేస్తే..పార్టీ నుండి సస్పెండ్ చేస్తా అని గట్టిగా హెచ్చరించిండు.

పార్టీలో కార్పొరేటర్లకు కొమ్ములు ఏమీ ఉండవని, అందరూ ఇష్టం వచ్చినట్లు పనిచేయకుండా పద్ధతిగా ప్రజల్లో ఉండి పనిచేయాలని సూచించిండు. ఎవరైనా కార్పొరేటర్లు అధికారులను ఇబ్బందులు పెడితే నాకు చెప్పండి అని అధికారులకు భరోసా ఇచ్చిండు. అధికారుల వెంట పడి పనిచేయించుకోవాలన్నారు.

అలాగే వెంగల్ రావు నగర్ కార్పొరేటర్ కిలారీ మనోహర్ ను సైతం మందలించారు కేసిఆర్.

మరో కార్పొరేటర్ ను కేటిఆర్ అభినందించారు. సినిమా లో నటించావా?  అని హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి ని ప్రశ్నించారు. GHMC కార్మికుడిగా హయత్ నగర్ కార్పొరేటర్ పనిచేయటం ఆదర్శమే అన్నారు కేటిఆర్.

హైదరాబాద్ నగర టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల తో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశమయ్యారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పోరేటర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టి, రెవెన్యూ అధికారుల సహాకారంతో కాపాడాలన్నారు. మరోపైపు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నడుచుకోవాలని కార్పొరేటర్లకు ఈ సందర్భంగా గుర్తు తెలిపారు. తమతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు, తమ డివిజన్లలో కావాల్సిన పనుల వివరాలను మంత్రికి అందించారు. కార్పోరేటర్ల అందించిన సమస్యలపైన వేంటనే చర్యలు తీసుకోవాలని హాజరైన వివిధ శాఖల అధికారులు మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలోనే పలువురు కార్పొరేటర్లకు తలంట్లు తప్పలేదు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/jZLKb4

 

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu