
ఊహించినట్లే జరిగింది. టిడిపి పదవులతోపాటు ఆ పార్టీ అందించిన అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రేవంత్ త్యజించారు.
స్పీకర్ మధుసూదనాచారికి తన రాజీనామా లేఖను ఏక వాక్యంలో రాశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాసిన ఏక వాక్య రాజీనామా లేఖను రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అమరావతిలో అందజేశారు.
టిడిపి అధినేత చంద్రబాబుకు పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను అందించిన రేవంత్ అదే చేత్తో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా లేఖను కూడా ఇచ్చారు.
ఒకేసారి అన్ని రాజీనామా లేఖలను సంధించారు రేవంత్.