దుర్మార్గంగా అడ్డుకుంటున్నారు: కేవీపీ ఓటు హక్కు గొడవపై ఉత్తమ్

By telugu teamFirst Published Jan 27, 2020, 1:35 PM IST
Highlights

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కేవీపీ రామచందర్ రావు ఓటు వేయకుండా టీఆర్ఎస్ అడ్డుకోవడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

సూర్యాపేట: నేరేడుచర్లలో తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ఓటు హక్కును వినియోగించుకోకుండా టీఆర్ఎస్ అడ్డుకోవడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు. 

ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన తమను దుర్మార్గంగా అడ్డుకుంటున్నారని ఆయన సోమవారం నేరేడుచర్లలో మీడియాతో అన్నారు. కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ ఉందని ఆయన అన్నారు. ఎన్నికైన సభ్యులతో చైర్మన్ ఎన్నికను గౌరవంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 

Also Read: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎన్నికల అధికారిగా జిల్లా అధికారులు నియమించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆదేశం మేరకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి తాము వచ్చామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక జరగకపోతే దేనికైనా సిద్ధపడుతామని ఆయన హెచ్చరించారు. 

తెలంగాణలోని మున్సిపాలిటీల చైర్మెన్, నగరపాలక సంస్థల మేయర్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. పలు చోట్ల కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారంనాడు నగరపాలక సంస్థల మేయర్ పదవులకు, మున్సిపాలిటీల చైర్మెన్ పదవులకు ఎన్నికలు జచరుగుతున్న విషయం తెలిసిందే. 

Also Read: పిడిగుద్దులు కురిపించుకున్న కోమటిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

click me!