పిడిగుద్దులు కురిపించుకున్న కోమటిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

By telugu team  |  First Published Jan 27, 2020, 1:24 PM IST

యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరస్పరం కొట్టుకున్నారు.


హైదరాబాద్: చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెసు, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసు వాహనాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెసు కార్యకర్తలు ప్రయత్నించారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. 

యాదగిరిగుట్టలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదగిరి గుట్టలో కాంగ్రెసు, టీఆర్ఎస్ దాదాపుగా సమాన స్థాయిలో వార్డులను గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెసు కలిసి పోటీ చేశాయి.

Latest Videos

undefined

ఆ తర్వాత సీపీఎం కౌన్సిలర్లకు టీఆర్ఎస్ వల వేసింది. విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్తున్న సీపీఎం కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డికి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మధ్య వివాదం చోటు చేసుకుంది.

Also Read: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

కాంగ్రెసు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ కేంద్రం వద్ద పరస్పరం కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  ఆ తర్వాత కౌన్సిల్ లోకి వెళ్లి ఇది అక్రమైన పొత్తు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. ఆయనను పోలీసులు బయటకు తీసుకుని వచ్చారు. కాంగ్రెసు కార్యకర్తలు ఆగ్రహంతో రాళ్లు రువ్వారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నైతిక విజయం తమదేనని కాంగ్రెసు ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. అత్యధిక స్థానాలు గెలిపించిన యాదగిరిగుట్ట ప్రజలకు తాము రుణపడి ఉంటామని ఆయన అన్నారు. స్థానికేతర ఎమ్మెల్సీల ఓట్లతో మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిని గెలుచుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 

నియంత రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ను ఉరితీసినా తప్పు లేదని ఆయన అన్ారు. స్థానిక సిఐ స్థానిక ఎమ్మెల్యేలకు అమ్ముడుపోయి టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోిపంచారు. యాదాద్రి నరసింహస్వామి కేసీఆర్ అంతు చూస్తారని ఆయన అన్నారు.

తెలంగాణలోని మున్సిపాలిటీల చైర్మెన్, నగరపాలక సంస్థల మేయర్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. పలు చోట్ల కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారంనాడు నగరపాలక సంస్థల మేయర్ పదవులకు, మున్సిపాలిటీల చైర్మెన్ పదవులకు ఎన్నికలు జచరుగుతున్న విషయం తెలిసిందే. 

click me!