కేసీఆర్ ఒక్క మాట చాలు... రేవంత్ రోడ్డుపై తిరగలేడు: ఎమ్మెల్యే సైదిరెడ్డి వార్నింగ్

By Arun Kumar PFirst Published Aug 10, 2021, 4:41 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సీఎం కేసీఆర్ ఒక్క మాటంటే రేవంత్ కనీసం రోడ్లపై కూడా తిరగలేడని హెచ్చరించారు. 

నల్గొండ: ఇంద్రవెల్లి సభలో సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. రేవంత్ దిగజారిన భాష విని తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ ఒక్క మాట అంటే రేవంత్ రోడ్లపై తిరగలేడని సైదిరెడ్డి హెచ్చరించారు.

''మేము రేవంత్ కన్నా ఎక్కువ మాట్లాడగలం కానీ కేసిఆర్ మాకు సంస్కారం నేర్పారు. నేను కేవలం ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన లక్ష మందితో సభ పెట్టగలను... ఆ సత్తా నాకుంది. అలాంటిది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి జనాన్ని తీసుకెళ్లి ఇంద్రవెల్లిలో సభపెట్టడం ఓ లెక్కా? రేవంత్ బ్లాక్ మెయిలింగ్ విద్యలు ఇక నడవవు'' అని సైదిరెడ్డి హెచ్చరించారు. 

''టీడీపీ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని బలి దేవత అన్నావు... ఇప్పుడేమో మహా దేవత అంటున్నావు. నువ్వు కాంగ్రెస్ లోకి రాగానే బలిదేవత కాస్త తెలంగాణ తల్లి అయ్యిందా?'' అంటూ రేవంత్ ను ఎద్దేవా చేశారు సైదిరెడ్డి.

read more  సంచులు మోసి పదవులు తెచ్చుకున్నావ్: రేవంత్ రెడ్డిపై చిరుమర్తి లింగయ్య ఆరోపణలు

''రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో ఆ పార్టీ సీనియర్లందరూ మధనపడుతున్నారు. కేవలం తనను తాను హైలెట్ చేసుకోవడానికే రేవంత్ ఇంద్రవెల్లి సభ పెట్టినట్లు ఉంది. ఈ సభకు 10వేలు వచ్చారా లేదా లక్షమంది వచ్చారా అనేది అందరూ చూసారు'' అన్నారు. 

''రేవంత్ రెడ్డి తన చరిత్ర మరిచి విమర్శలు చేస్తున్నారు. జనంలో ఏదో ఒకటి క్రీయేట్ చెయ్యాలనే మాటలు తప్ప ఏమీలేదు! ఆయన లాగా మేము కూడా పగతో, ప్రతీకారంతో రాజకీయం చేస్తే రోడ్డుపై తిరగగలడా?'' అని రేవంత్ ను సైదిరెడ్డి హెచ్చరించారు. 

click me!