పూటకో మాట, రోజుకో పార్టీ: రేవంత్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Aug 10, 2021, 4:36 PM IST
Highlights

రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న సమయంలో సోనియాగాంధీ దయ్యం, బలిదేవత అన్న రేవంత్ రెడ్డికి ఇవాళ సోనియాగాంధీ దేవత ఎలా అయిందని ఆయన ప్రశ్నించారు. పూటకో మాట, రోజుకో పార్టీ మార్చడం రేవంత్ రెడ్డి నైజం అని ఆయన విమర్శించారు.

హైదరాబాద్: రేవంత్ రెడ్డి రోజుకో పార్టీలో ఉంటూ పూటకో  మాట మాట్లాడుతున్నాడని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు టీఆర్ఎస్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడంలో రేవంత్ రెడ్ది దిట్ట అని ఆయన చెప్పారు. ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  ఆలోచించుకోవాలని ఆయన కోరారు.రేవంత్ రెడ్డి.... చరిత్ర మరిచిపోయావా అని ఆయన ప్రశ్నించారు.ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకొంది కాంగ్రెస్ పార్టీ కాదా అని  అడిగారు.ఆదివాసీలను చంపిందే కాంగ్రెస్ పార్టీ అని  మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.ఆదీవాసీలను కాల్చి చంపిన పార్టీయే  స్మారకస్థూపం నిర్మిస్తానని చెప్పడం సిగ్గు చేటన్నారు. 

టీడీపీలో ఉన్న సమయంలో సోనియాగాంధీ దయ్యం, బలిదేవత అని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఈ వీడియోను మీడియా సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విన్పించారు. ఇప్పుడేమో సోనియాగాంధీ దేవత అంటున్నారని మంత్రి గుర్తు చేశారు. వందలాది విద్యార్థుల బలిదానానికి కాంగ్రెస్ పార్టీ కారణం అవునో కాదో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని నైజాన్ని గుర్తించాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. 

చంద్రబాబు మోచేయి నీళ్లు తాగే రేవంత్ రెడ్డిని నమ్మాలా అని ఆయ ప్రశ్నించారు.టీపీసీసీ చీఫ్‌గా ఉంటూ చంద్రబాబు ఆదేశాలను తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు.ఉమ్మడి రాష్ట్రంలో దళితులెవరైనా పుల్‌టైమ్ సీఎంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.దళితుల పేరుతో ఓట్ల డ్రామా ఆడే పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. ఇందులో రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు అంటూ విమర్శించారు.దళితులకు, పేలాలు, పుట్నాలు పంచడం తప్ప కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు.60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరైనా దళిత ప్రధాని ఉన్నారా రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు.


 

click me!