అన్నదాతతో చెప్పులు మోపించిన నల్లగొండ ఎంపి గుత్తా (వీడియో)

Published : Feb 09, 2018, 09:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
అన్నదాతతో చెప్పులు మోపించిన నల్లగొండ ఎంపి గుత్తా (వీడియో)

సారాంశం

చెరువుల పరిశీలనలో గుత్తా రచ్చ పక్కవ్యక్తితో చెప్పులు మోపించిన ఎంపి మీడియా కంట పడడంతో కవర్ చేసే యత్నం

నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో చెరువుల పరిశీలనకు వెళ్లారు గుత్తా. అయితే అక్కడ పలు గ్రామాల్లో చెరువులను పరిశీలించారు. అదే సందర్భంలో చింతకుంట అనే గ్రామం చెరువులోకి దిగారు. ఆ సమయంలో తన చెప్పులను వేరే వ్యక్తితో మోపించారు. ఇలా ఒకే గ్రామంలో కాకుండా చాలా గ్రామాల్లో చెప్పులను ఇలాగే మోపించినట్లు చెబుతున్నారు.

అయితే చింతకుంట చెరువు వద్ద ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధులు షూట్ చేశారు. మీడియా వారు షూట్ చేస్తున్న విషయాన్ని గుర్తు పట్టిన గుత్తా గన్ మెన్ ఆ చర్యను కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీడియా కెమెరాల కండ్లు గుత్తా బాగోతాన్ని గుప్పిట పట్టాయి. ఇంకేముంది.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నాయి. గుత్తా బాగోతం మీరూ చూడండి. కింద వీడియోలో...

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే