కేసిఆర్ బాటలో రేవంత్

First Published Feb 9, 2018, 3:54 PM IST
Highlights
  • అనుకోకుండానే కేసిఆర్ స్టయిల్ ఫాలో అయితున్న రేవంత్
  • టిఆర్ఎస్ లో గతంలో పనిచేసిన రేవంత్

ప్రస్తుత తెలంగాణ డైనమిక్ పొలిటీషియన్స్ జాబితాలో తొలి వరుసలో సిఎం కేసిఆర్ ఉంటారు. ఆయనతోపాటు వయసులో చిన్నవాడైనా రేవంత్ కూడా అదే వరుసలో ఉండేందుకు శతవిదాలా పోరాడుతున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న పాలసీ రేవంత్ రెడ్డిది. అందుకే ఆయన అస్తమానం నాటి ఉద్యమ నేత, ప్రస్తుత సిఎం అయిన కేసిఆర్ మీద, కేసిఆర్ ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. రేవంత్ కేవలం సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. టిడిపిలో ఉన్నా.. కాంగ్రెస్ లో ఉన్నా రేవంత్ టార్గెట్ కేసిఆర్ ఫ్యామిలీనే అన్న వాతావరణం నెలకొల్పగలిగారు. ఒకవైపు కొట్లాట పెట్టుకుంటున్నప్పటికీ రేవంత్ మీద ప్రత్యక్షంగా.. పరోక్షంగా కెసిఆర్ ప్రభావం బాగానే వుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ వివరాలేంటో కింద చదువుదాం. 

ఇక అసలు విషయానికి వద్దాం. తాజాగా రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ స్టయిల్ ను అనుసరిస్తున్నారు. అనుకునే ఫాలో అవుతున్నారా? లేదా అనుకోకుండానే ఫాలో అయితున్నారా అన్నది పక్కనపెడితే.. అనేక అంశాల్లో కేసిఆర్ అడుగు జాడల్లోనే రేవంత్ ప్రయాణం సాగుతున్నది.  గతంలో తెలంగాణ ఉద్యమకాలంలో కేసిఆర్ హైదరాబాద్ లో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. హైదరాబాద్ బయట ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. చేతికి దట్టీ కట్టించుకోవడం ఆనవాయితీ. చాలా సందర్భాల్లో కేసిఆర్ చేతికి దట్టీ కట్టించుకుంటారు. దట్టీ కట్టించుకున్న తర్వాత మీటింగుల్లో పంచ్ డైలాగులతో నిప్పులు చెరిగేవారు.

ఇక సీన్ కట్ చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. అదేమంటే కేసిఆర్ ఫ్యామిలీపై చెలరేగిపోవడమే రేవంత్ పని. చాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలో కేసిఆర్, కేటిఆర్, హరీష్ ఇలా.. ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ.. నాలుగేళ్లు నెట్టుకొచ్చారు రేవంత్. కొత్త కొత్త అంశాలను లేవనెత్తుతూ సర్కారు పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు రేవంత్. అయితే రేవంత్ కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్ బయట జరిగే కార్యక్రమాల్లో చేతికి దట్టీ కట్టుకుంటున్నారు. దట్టీతోనే సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.

మరో విషయమేమంటే.. జాతకాలు, విశ్వాసాలు, జ్యోతిష్యం, పంచాంగం లాంటి అంశాల పట్ల కేసిఆర్ కు చాలా మక్కువ. ఆ విషయంలో రేవంత్ కూడా కేసిఆర్ బాటలోనే నడుస్తారు. ఇంకోమాటలో చెప్పాలంటే కేటిఆర్ కు ఇవంటే అసలే పడవు. అందుకే ఎక్కడా కేటిఆర్ కనబడరు. ఇక లక్కీ నెంబర్ ను కేసిఆర్ నమ్ముతారు. రేవంత్ కూడా నమ్ముతారు. కేసిఆర్ లక్కీ నెంబర్ 6 అయితే రేవంత్ లక్కీ నెంబర్ 9. ప్రతి నెంబరు ఇలా ఈ అంకె వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు నేతలూ. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో తెలియకుండానే కొందరు నేతలు ప్రత్యర్థుల బాటలో ఇలా నడుస్తున్నారు.

రేవంత్ టిఆర్ఎస్ లో ఉన్నప్పుడే నేర్చుకున్నరా?
నిజానికి తెలంగాణ లో ప్రజల భాషలో మాట్లాడే నేతల జాబితాలో కేసిఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన మాట్లాడితే అర్థం కాని జనాలు ఉండరు. సూటిగా, స్పష్టంగా చెప్పడంలే కేసిఆర్ కు కేసిఆరే సాటి. అదే కోవలో నడుస్తున్నారు రేవంత్ కూడా. రేవంత్ కూడా సూటిగా, స్పష్టంగా ప్రజల భాషలోనే మాట్లాడతారు. అయితే నాడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో కూడా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో కేసిఆర్ శైలిని దగ్గరగా ఉండి ఒంటబట్టించుకున్నారా అన్న చర్చ కూడా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాలంలో రేవంత్ ఫొటో కింద ఉంది చూడొచ్చు. ఎర్ర రంగు మార్కు వేసిన వృత్తంలో రేవంత్ కనిపిస్తారు.

click me!