అసెంబ్లీని రద్దుచేసిన మరుక్షణమే రాష్ట్రపతి పాలన... దమ్ముంటే ఆ పని చేయ్: కేసీఆర్‌కు ఎంపీ అరవింద్ చాలెంజ్

By Sumanth KanukulaFirst Published Nov 29, 2022, 5:43 PM IST
Highlights

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకంలో పేదలకు ఇచ్చే డబ్బులో కూడా టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకంలో పేదలకు ఇచ్చే డబ్బులో కూడా టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భీంగల్ పట్టణంలో బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి.. జనంతోనే మనం పాదయాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని విమర్శించారు. ఉ

మ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు మరుక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని అన్నారు. గవర్నర్ కూడా రెడీగా ఉన్నారని.. తాను దీని గురించి ఎక్కువగా మాట్లాడనని అన్నారు. సీఎం కేసీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని సవాల్ విసిరారు. నిజాలు మాట్లాడితే తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పైసలు తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇటీవల బేగంపేటలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. 

click me!