తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ ?

By narsimha lodeFirst Published Feb 27, 2020, 7:08 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

హైదరాబాద్: తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త అధ్యక్షుడి నియామకం పై  జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. 

Also read:కేసీఆర్,ఎంఐఎంకు చెక్: సీఏఏకు అనుకూలంగా హైద్రాబాద్‌లో బీజేపీ సభ

ఆర్ఎస్ఎస్ మాత్రం సంజయ్ పేరును ప్రధానంగా సూచించినట్టుగా సమాచారం. పార్టీలో ఇతర నేతలు మాత్రం సంజయ్ పేరును వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల పార్టీ కీలక నేతల నుంచి  అభిప్రాయ సేకరణ పార్టీ హైకమాండ్ జరిపింది. అభిప్రాయ సేకరణలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చినా... ఢిల్లీ పెద్దలు మాత్రం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టాలని దాదాపు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలకే  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు దక్కుతూ వచ్చాయి. హైద్రాబాద్ కు సంబంధం లేని నేతలకు ఈ పదవిని కట్టబెట్టాలని పార్టీ నేతలు కోరుతున్నారు.  తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇతర జిల్లాలకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కేటాయిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు.

  తొలిసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆర్ఎస్ఎస్ మాత్రం పార్టీ నాయకత్వానికి సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీలోని ఇతరులు మాత్రం సంజయ్ కు ఈ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని  ప్రచారం సాగుతోంది. 

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కూడ కొనసాగించే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ పరిణామాలన్నీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. 

ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన బీజేపీ జాతీయ నాయకత్వం సంజయ్ కే రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన నేతలపై కూడా బీజేపీ జాతీయ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 

click me!