యువనేతకు షాకిచ్చిన కేటీఆర్: టాటూపై విద్యార్ధి నేతకు క్లాస్

Published : Feb 27, 2020, 06:14 PM ISTUpdated : Feb 27, 2020, 06:16 PM IST
యువనేతకు షాకిచ్చిన కేటీఆర్: టాటూపై  విద్యార్ధి నేతకు క్లాస్

సారాంశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ విద్యార్ధి విభాగం నేత రవికుమార్ కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకొన్నారు. 


హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వీరాభిమాని కి షాక్ ఇచ్చారు. కేటీఆర్ పై అభిమానంతో పార్టీ విద్యార్థి విభాగం నేత రవికుమార్ తన ఒంటిపై కేటీఆర్ చిత్రంతో టాటూ వేయించుకున్నారు.

 

 తమ  నేత కేటీఆర్ చిత్రాన్ని తన ఒంటిపై వేసుకోవడాన్ని అభిమానంగా భావించారు. ఆ యువ నేత తన అభిమానాన్ని చాటుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

Also read:నాంపల్లి కోర్టు ముందు హాజరైన కవిత

 దీనిని పరిశీలించిన కేటీఆర్ టాటూ వేయించుకోవడాన్ని తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా అతనికి క్లాస్ తీసుకొన్నారు.  ఇలాంటి అభిమానానికి తాను మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. టాటూ వేయించుకోవడం ఆరోగ్యానికి హానికరమని కెటిఆర్ తెలిపారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ సూచించారు.

 కేటీఆర్ ని ఆకట్టుకునేందుకు ఆ యువకుడు చూపిన వీరాభిమానం మొదటికే మోసం తెచ్చినట్లు అయింది. అభిమానం చాటుకునేందుకు కేటీఆర్ చిత్రాన్ని వీపుపై వేసుకున్నా  కూడ కేటీఆర్ మద్దతు మాత్రం ఆ యువకుడు పొందలేకపోయాడు.

 


 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!