తెలంగాణ ఎన్నికల బరిలో ప్రముఖ సినీనటుడు...ఎక్కడినుండో తెలుసా?

Published : Sep 22, 2018, 11:39 AM IST
తెలంగాణ ఎన్నికల బరిలో ప్రముఖ సినీనటుడు...ఎక్కడినుండో తెలుసా?

సారాంశం

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరికొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఇక ఇండిపెండెంట్ గా ఫోటీకి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే తాజాగా ఓ సినీనటుడు కూడా తాను ఎన్నిలక బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. తమ లబ్ధికోసం కులాలు, మతాల పేరుతో ప్రస్తుత పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని సదరు సినీనటుడు పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు గుణపాఠం చెప్పడానికే ఎన్నికల బరితో దిగుతున్నట్లు ప్రకటించాడు.

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరికొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఇక ఇండిపెండెంట్ గా ఫోటీకి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే తాజాగా ఓ సినీనటుడు కూడా తాను ఎన్నిలక బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. తమ లబ్ధికోసం కులాలు, మతాల పేరుతో ప్రస్తుత పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని సదరు సినీనటుడు పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు గుణపాఠం చెప్పడానికే ఎన్నికల్లో పోటీకి సిద్దమైనట్లు ప్రకటించాడు.

ప్రముఖ యాక్టర్ జీవి. సుధాకర్ నాయుడు తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. హౌసింగ్ బోర్డు ధర్మారెడ్డికాలనీ ఫేజ్ 1 లోని వినాయక మండపంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు.

త్వరలోనే కూకట్ పల్లి లో ప్రచారం కూడా ప్రారంభించనునున్నట్లు జీవి వెల్లడించాడు. ఐ లవ్ కూకట్ పల్లి పేరుతో సాగనున్న ఈ ప్రచారంలో నియోజకవర్గ ప్రజలందరిని కలవనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తెలంగాణ, ఎపి లలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు సుపరిపాలన అందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. తన రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని సుధాకర్ నాయుడు ప్రకటించాడు.   
 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu