రైలులో దారి దోపిడి...భారీ మొత్తంలో బంగారం, నగదు చోరీ

By ramya neerukondaFirst Published Sep 22, 2018, 11:06 AM IST
Highlights

సిగ్నల్స్‌ కట్‌ చేసిన అనంతరం దాదాపు 20 నిమిషాలపాటు రైలు దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఈ సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. 

బెంగళూరు నుంచి  కాచిగూడ వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలులో దారిదోపిడి జరిగింది. రైలు మహబూబునగర్‌ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిచిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కిటికీల నుంచి నగదు, నగలు దోచుకెళ్లారు. ఐదుగురు ప్రయాణికుల నుంచి మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. రైలు కాచిగూడ చేరుకున్న అనంతరం బాధితులు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుండగులు సిగ్నల్స్‌ ట్యాంపరింగ్‌ చేసినట్లు రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ అనుమానిస్తున్నారు. సిగ్నల్స్‌ కట్‌ చేసిన అనంతరం దాదాపు 20 నిమిషాలపాటు రైలు దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఈ సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు

click me!