గాంధీభవన్ లో విషాదం....పురుగులమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 10:56 AM IST
Highlights

తెలంగాణలో  కౌలు రైతుల పరిస్థితి అద్వానంగా మారింది. ప్రభుత్వం రైతులకు అందించే తోడ్పాటును కౌలు రైతులకు అందించడం లేదు. అంతేకాకుండా పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం... వ్యవసాయ పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు, వడ్డీలు ఎక్కువ అవడంతో ఇటీవల సాధారణ రైతులతో పాటు కౌలు రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. తాజాగా మరో కౌలు రైతు ఏకంగా కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటనతో గాంధీభవన్ వద్ద కలకలం రేగింది.
 
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగవత్‌వీడు గ్రామానికి చెందిన దేవబత్తిని వెంకటేశ్వరరావు ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటాడు. అయితే కౌలు ధరలు, వ్యవసాయ పెట్టుబడులు పెరిగడంతో ఇతడు బైట వ్యక్తుల వద్ద భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. అయితే పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం...రోజురోజుకు అప్పిచ్చినవారి ఒత్తిడి ఎక్కువవడంతో వేంకటేశ్వరరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 

దీంతో ఇతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం నుండి హైదరాబాద్ కు వచ్చిన వెంకటేశ్వరరావు నేరుగా కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ కు చేరుకున్నాడు. అక్కడ తనతో పాటే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అయితే ఇతడిని గమనించినవారు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే వెంకటేశ్వరరావు చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు.
 
click me!