13నెలల చిన్నారికి ఉరివేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి.. వరకట్నహత్య అంటున్న కుటుంబం..

Published : Feb 18, 2022, 10:52 AM IST
13నెలల చిన్నారికి ఉరివేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి.. వరకట్నహత్య అంటున్న కుటుంబం..

సారాంశం

హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం నాడు ఓ తల్లి తన 13నెలల చిన్నారికి ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధింపులే ఆమె మరణానికి కారణం అంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. 

సికింద్రాబాద్‌ : Additional dowry harassmentతల్లితో సహా ఓ చిన్నారిని బలి తీసుకున్నాయి. అమ్మాయికి marriage సమయంలో ఇచ్చిన కట్నం సరిపోక.. ఆ తరువాత కూడా కాపురానికి వెళ్లాలంటే లక్షలు కుమ్మరించినా సరిపోవడం లేదని ఆడపిల్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనికోసం అదనపు కట్నం రక్కసి కోరలు చాస్తోంది. దీనికి ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు. 

Secunderabad నాచారంలోని ఓ ఇంట్లో 26 ఏళ్ల మహిళ, 13 నెలల చిన్నారి ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారికి ఉరివేసిన మహిళ తాను కూడా suicide చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే, అదనపు కట్నం కోసం In-laws వేధించడం వల్లే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ మహిళను తెలుగు దీపికగా గుర్తించారు, 2009లో ఆమె తెలుగు చంద్రశేఖర్‌ని వివాహం చేసుకుంది. 2021, ఫిబ్రవరిలో వీరికి రుత్విక(13)నెలలు జన్మించింది. నాచారం ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ వివరాలు తెలియజేస్తూ.. "రుత్విక మొదటి పుట్టినరోజు సందర్భంగా.. దీపిక కుటుంబం 2 తులాల బంగారు గొలుసును ఇస్తామని మాట ఇచ్చారు. కానీ ఇవ్వలేకపోయారు... దీంతో చంద్రశేఖర్ దీపికను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన కుమార్తెకు ఉరివేసి హత్య చేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

దీపిక మరణం మీద దీపిక సోదరుడు సిద్దార్థ్ మాట్లాడుతూ..  దీపికను చంద్రశేఖర్, అతని కుటుంబ సభ్యులు హత్య చేశారని నమ్మడానికి కారణాలు ఉన్నాయని చెప్పారు. “ఆమె హాలులో ఉరి వేసుకుని కనిపించింది. వారికున్నదే రెండు గదుల ఇల్లు.. హాల్లో ఆమె ఉరివేసుకుంటే ఎవ్వరికీ కనిపించకుండా ఎలా ఉంటుంది? అని సిద్దార్థ్ అనుమానం వ్యక్తం చేశాడు. అంతేకాదు దీపికను అత్తమామలు నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నారని సిద్దార్థ్‌ ఆరోపించాడు. “పెళ్లిలో 25 తులాల బంగారం పెట్టాం. వారి డిమాండ్లన్నింటినీ నెరవేర్చాం. అయినా కూడా ఇప్పటికీ దీపికను వేధిస్తూనే ఉన్నారు” అని ఆయన అన్నారు.

అంతేకాదు దీపికను బయటకు వెళ్లడానికి అనుమతించేవాళ్లు కాదు.. తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యలుతో మాట్లాడనిచ్చేవారు కాదు.. అని సిద్దార్థ్ ఆరోపించారు. ఇక కూతురు రుత్విక పుట్టిన తర్వాత చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి’’ అని సిద్దార్థ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పాపకు బంగారు గొలుసు పెట్టేందుకు సిద్ధార్థ్ కుటుంబం అంగీకరించింది. అయితే, చంద్రశేఖర్‌ పాప పుట్టినరోజుకు వారిని పిలవలేదు. దీంతో దీపికా తండ్రి దీపిక లేదా రుత్విక పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి అంగీకరించారు.

ఇక ఘటన జరిగిని ఫిబ్రవరి 17, గురువారం నాడు తల్లి, కుమార్తె వారి ఇంటి హాలులో ఉరికి వేలాడుతూ కనిపించారు. అయితే సిద్దార్థ్ ఉదయం 11 గంటలకు ఆమెను ఆన్‌లైన్‌లో చూశానని చెప్పాడు. కాగా, ఉదయం 10 గంటల సమయంలో కుమార్తెకు ఉరివేసి.. దీపిక ఆత్మహత్య చేసుకుందని సిద్దార్థ్ బావ చెబుతున్నాడు. మృతదేహాలను అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...