ఫ్రెండ్ పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల మృతి

Published : Feb 18, 2022, 09:25 AM IST
ఫ్రెండ్ పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల మృతి

సారాంశం

నాగర్ కర్నూల్ జిల్లాలో (nagarkurnool district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఫ్రెండ్ పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో (nagarkurnool district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. జిల్లాలోని కల్వకుర్తి మండలంలోని  మార్చాల సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను అరవింద్‌, శిరీష, కిరణ్మయిగా గుర్తించారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన అరవింద్, వర్ధిపట్లకు చెందిన శిరీష, ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్మయి, మిర్యాలగూడ‌కు చెందిన రేణుకలు.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నారు. వీరు హైదరాబాద్‌లోనే హాస్టల్స్‌లో ఉంటున్నారు. గురువారం వీరు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దుండ మండలం బండోనిపల్లి గ్రామంలో ఫ్రెండ్ వివాహ విందుకు హాజరయ్యారు. 

వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం గురువారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్చాల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అరవింద్, శిరీష, కిరణ్మయిలు అక్కడికక్కడే మృతిచెందారు. రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన రేణుకను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే