యాదాద్రి ఆలయ భద్రతకు రూ.15కోట్లు ఖర్చు..!

Published : Feb 18, 2022, 10:32 AM IST
యాదాద్రి ఆలయ భద్రతకు రూ.15కోట్లు ఖర్చు..!

సారాంశం

దాదాపు 15 రోజుల క్రితం రాచకొండ పోలీసులు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పరిధిలోని వీవీఐపీ కాటేజీలు, ఇతర ప్రాంగణాలతో పాటు ఆలయంలో సెక్యూరిటీ ఆడిట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయన భద్రత కట్టుదిట్టంగా ఉండేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా.. ఈ భద్రత ఏర్పాట్లకు గాను దాదాపు రూ.15కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

త్వరలో ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భద్రతా ప్రతిపాదనలో భాగంగా రాచకొండ పోలీసులు కొండపై కొత్త పోలీస్ స్టేషన్ , యాంటీ టెర్రర్ యూనిట్ ఆక్టోపస్ కమాండోలను సిఫార్సు చేశారు. 

దాదాపు 15 రోజుల క్రితం రాచకొండ పోలీసులు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పరిధిలోని వీవీఐపీ కాటేజీలు, ఇతర ప్రాంగణాలతో పాటు ఆలయంలో సెక్యూరిటీ ఆడిట్ చేశారు.

ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ , ప్రభుత్వానికి  ఈ మేరకు ప్రతిపాదనలు పంపించారు.పోలీసులు భద్రతా ప్రణాళికను ప్రతిపాదించారు. కాగా.. దీని అమలుకు దాదాపు 15 కోట్లు ఖర్చవుతుందని తేలడం గమనార్హం.

. భద్రతా అంశాలలో డ్రోన్‌లను కొనుగోలు చేయడం, భక్త ప్రవాహం, వాహనాలను నిర్వహించడం, క్యూ నిర్వహణ, చేతితో పట్టుకునే మెటల్ డిటెక్టర్‌ల కొనుగోలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ రికగ్నిషన్ టెక్నాలజీ, బ్యాగేజీ చెకింగ్, ఇతర అంశాలు ఉన్నాయి.

అయితే, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా  స్పందించకపోవడం గమనార్హం.. “భద్రతా ఏర్పాట్లు ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి ,ప్రతిపాదనలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం యాగశాలలో మైదానం,పనుల గుర్తింపు వంటి కొన్ని అంశాలు పూర్తి చేయాల్సి ఉంది, ఆపై మేము భద్రతా బ్లూప్రింట్‌ను ఖరారు చేయవచ్చు, ”అని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో చెప్పడం గమనార్హం.

ప్రస్తుతానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీలపై స్పష్టత లేదని.. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాత.. ఎంత మంది పోలీసులు మోహరించే అవకాశం ఉందని తేలనుందని అధికారులు చెప్పారు. .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే