
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొంటూరులో ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే.. నిన్న హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైని వివాహిత సౌందర్య భర్త గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం తరచూ సౌందర్యను గణేష్ వేధిస్తున్నాడు. పిల్లలు పుట్టాక బాగా లావు అయ్యావని.. అందంగా లేవంటూ ఆమెను మానసికంగా హింసించే వాడని సమాచారం. సౌందర్య అత్తమామలపైనా గణేష్ దాడి చేశాడని తెలిపింది.
ALso Read: బన్సీలాల్‌పేటలో ఇద్దరు పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్య .. భర్త అరెస్ట్, వెలుగులోకి బాడీ షేమింగ్ కోణం
అతని వేధింపుల కారణంగా యాదాద్రిలో వున్న ఫ్లాట్‌ను గణేష్ మీద రాశారు. అయితే బన్సీలాల్‌పేటలోని డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కూడా తనపై రాయాలంటే గణేశ్.. సౌందర్యను చిత్ర హింసలకు గురిచేశాడు.పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చామని.. అయినప్పటికీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.