Hyderabad: నైరుతి రుతుపవనాలు సుమారు 10 రోజుల ఆలస్యం తర్వాత 2023 జూన్ 21న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాలు ప్రారంభ దశలో బలహీనంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, జూన్ చివరి నాటికి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
monsoon in Telangana: ఆలస్యమైన రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 21న (బుధవారం) రుతుపవనాలు తెలంగాణకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సుమారు 10 రోజుల ఆలస్యం తర్వాత 2023 జూన్ 21న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాలు ప్రారంభ దశలో బలహీనంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, జూన్ చివరి నాటికి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు జూన్ 21న ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో నేడు (మంగళవారం) కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, జూన్ 26 నాటికి రాష్ట్రం మొత్తం రుతుపవనాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. గత సంవత్సరం, రుతుపవనాలు జూన్ 13న రాగా, 2021 జూన్ 5న , 2020లో జూన్ 11న చేరాయి. రుతుపవనాల ఆలస్యం కావడానికి ఎల్ నినో వాతావరణ దృగ్విషయం కారణమని చెప్పవచ్చు. ఇది భారత్, ఆస్ట్రేలియా సహా పలు ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
కాగా, సోమవారం తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ నుంచి 44.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో కాస్త ఎండ వేడిమి తగ్గుముఖం పట్టింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో అత్యధికంగా 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదించింది. ఐఎండీ హైదరాబాద్ సూచన ప్రకారం, జూన్ 23 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది.
ఎల్-నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమయ్యాయని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. రుతుపవనాలు అసాధారణంగా ఆలస్యమైనా ఈ ఏడాది తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ, స్కైమెట్ పేర్కొన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ఏడాది మంచి రుతుపవనాలు రావడానికి దక్షిణ ద్వీపకల్పం బాగా సరిపోతుందని మహేశ్ పలావత్ తెలిపారు.