బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయ్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

Published : Sep 02, 2023, 08:02 PM IST
బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయ్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

సారాంశం

బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. కుల సంఘాల పెద్దలు, వెనుకబడిన వర్గాల వారు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.  

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వివరించారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కు సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు తమ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం పై బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రైవేట్ ఆస్తి కాదని ఫైర్ అయ్యారు. కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లుతున్న బీజేపీ నేత రమణా రెడ్డి, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. 

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, వారి బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను వేధించడం మొదలు పెట్టిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలు కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లితే కేసీఆర్‌కు ఎందుకు భయం అని అడిగారు. 

Also Read: సీఎం కొడుకు స్టాలిన్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్.. ‘సనాతన ధర్మాన్ని దోమతో పోల్చాడు’

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఈ భయం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గజ్వేల్‌ను సొంత ఆస్తిగా కేసీఆర్ చూస్తున్నాడని అన్నారు. గజ్వేల్‌ను కేసీఆర్‌కు నిజాం రాసిచ్చాడా? లేక ఒవైసీ రాసిచ్చాడా? అని ప్రశ్నించారు. తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు రైతులే గుణపాఠం చెబుతారని, రైతుల బలాన్ని చూపిస్తారని అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వం అని, బీఆర్ఎస్ వాటాల ప్రభుత్వం అని ఆరోపణలు గుప్పించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ