హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత.. అంతరాష్ట్ర ముఠాల అరెస్టు..

Published : Sep 02, 2023, 05:58 PM IST
హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత..  అంతరాష్ట్ర ముఠాల అరెస్టు..

సారాంశం

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న రెండు అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితుల గంజాయి ముఠాను అరెస్టు చేసి 270 కిలలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసుల కన్ను గప్పి వివిధ మార్గాల్లో కస్టమర్లకు గంజాయిని  విక్రయిస్తున్నారు. తాజాగా అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు రాచకొండ SOT పోలీసులు. గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు.

ఈ ఆపరేషన్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. ఈ క్రమంలో 200 కేజీల గంజాయితో పాటు 50 వేల రూపాయాలను సీజ్‌ చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ చౌహన్‌ సమాచారం అందించారు. నిందితులను రాకేష్ చౌహన్, బజరంగ్ సింగ్, పవన్, సమీర్‌రామ్ లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నట్టు సీపీ చౌహన్‌ వెల్లడించారు. రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న పోలీసులు గుర్తించారు. 

మరో కేసులో గంజాయి స్మగర్లులు దేవరాజ్‌ పవార్‌, సచిన్‌, సుభాష్‌ షిండేలను అరెస్ట్‌ చేసినట్లు సీపీ చౌహన్‌ వెల్లడించారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ