మొయినాబాద్ ఫాంహౌస్ :4 రోజుల తర్వాత చండూరులో ప్రత్యక్షమైన నలుగురు ఎమ్మెల్యేలు

By narsimha lode  |  First Published Oct 30, 2022, 5:25 PM IST

నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ కేసీఆర్ వెంట  చండూరులో  జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో  పాల్గొన్నారు. 


చండూరు:  తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు  చండూరు సభకు వచ్చారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ఘటన తర్వాత నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు.ఈ  నెల 26 వ తేదీ  నుండి  ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్  లోనే ఉన్నారు. కేసీఆర్ తో కలిసి  ప్రత్యేక  హెలికాప్టర్ లో  నలుగురు ఎమ్మెల్యేలు చండూరు సభకు వచ్చారు. 

అచ్చంపేట  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్  రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ,తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డిలు కేసీఆర్ తో కలిసి ఈ సభకు  వచ్చారు.  కేసీఆర్ తాను ప్రసంగిస్తున్న సమయంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రజలకు పరిచయం చేశారు. వంద కోట్లు ఇస్తామన్నా కూడ తెలంగాణ  ఆత్మగౌరవాన్ని  కాపాడారని  నలుగురు ఎమ్మెల్యేలను అభినందించారు.

Latest Videos

undefined

ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి,  తిరుపతికి చెందిన సింహయాజీ, హైద్రాబాద్  కు చెందిన నందకుమార్ లు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే రోహిత్  రెడ్డి పోలీసులకు పిర్యాదు  చేశారు. ఈ  ఫిర్యాదు  ఆదారంగా పోలీసులు   నిందితులను అరెస్ట్  చేశారు.  ఎమ్మెల్యేలతో  ఆరోపణలు ఎదుర్కొంటున్నవ్యక్తులు మాట్లాడినట్టుగా  ఉన్న  ఆడియో  సంభాషణలు వెలుగు చూశాయి.

also read:ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు:చండూరులో బీజేపీపై కేసీఆర్ ఫైర్

 ఎమ్మెల్యేల ప్రలోభాల తో తమకు  సంబంధం లేదని  బీజేపీ ప్రకటించింది. దీని వెనుక ప్రగతి భవన్  డైరెక్షన్ ఉందని బీజేపీ  ఆరోపించింది. కానీ తమ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వెనుక  బీజేపీ ఉందని  టీఆర్ఎస్ ఆరోపించింది.తాండూరు ఎమ్మెల్యే రోహిత్  రెడ్డి ఫిర్యాదు మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న  రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు చంచల్  గూడ జైల్లో ఉన్నారు. 

మొయినాబాద్ ఫాం హౌస్ ఘటన తర్వాత తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి భద్రతను పెంచింది ప్రభుత్వం, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తో పాటు గన్ మెన్లను కూడా పెందింది ప్రభుత్వం.రోహిత్  రెడ్డి ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు సాగించినట్టుగా ఆడియో సంభాషణలు బయటకు వచ్చాయి. దీంతో రోహిత్ రెడ్డికి  భద్రతను పెంచారు.

click me!