తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 3944 కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్రత

Siva Kodati |  
Published : Jan 27, 2022, 08:16 PM ISTUpdated : Jan 27, 2022, 08:27 PM IST
తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 3944 కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్రత

సారాంశం

తెలంగాణలో (corona cases in telangana) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తాజాగా 97,549 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,944 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 7,51,099కి పెరిగింది.

తెలంగాణలో (corona cases in telangana) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తాజాగా 97,549 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,944 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 7,51,099కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,444 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 7,07,498కి చేరుకుంది. అలాగే వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 39,520 యాక్టీవ్ కేసులు వున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.20 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ఇవాళ్టీ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1372 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 40, భద్రాద్రి కొత్తగూడెం 101, జీహెచ్ఎంసీ 1372, జగిత్యాల 67, జనగామ 40, జయశంకర్ భూపాలపల్లి 42, గద్వాల 40, కామారెడ్డి 43, కరీంనగర్ 80, ఖమ్మం 135, మహబూబ్‌నగర్ 79, ఆసిఫాబాద్ 19, మహబూబాబాద్ 45, మంచిర్యాల 76, మెదక్ 60, మేడ్చల్ మల్కాజిగిరి 288, ములుగు 26, నాగర్ కర్నూల్ 59, నల్గగొండ 91, నారాయణపేట 12, నిర్మల్ 41, నిజామాబాద్ 105, పెద్దపల్లి 95, సిరిసిల్ల 48, రంగారెడ్డి 259, సిద్దిపేట 104, సంగారెడ్డి 120, సూర్యాపేట 66, వికారాబాద్ 56, వనపర్తి 64, వరంగల్ రూరల్ 78, హనుమకొండ 117, యాదాద్రి భువనగిరిలో 76 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. 

తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా..  దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

దేశంలో నిన్న(జనవరి 26) 14,62,261 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 72,21,66,248 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 22,35,267 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,63,84,39,207కి చేరింది. 
 

PREV
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?