అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మోడీ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలి.. రాహుల్ గాంధీ..

Published : Sep 20, 2023, 08:32 AM IST
అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మోడీ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలి.. రాహుల్ గాంధీ..

సారాంశం

తెలంగాణ ఏర్పాటు అంశంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంటులో 'అగౌరవరకరమైన' వ్యాఖ్యలు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాహుల్ గాంధీ అన్నారు.

‘తెలంగాణ అమరవీరులను, వారి త్యాగాలను గౌరవించకుండా ప్రధాని మోదీ ప్రసంగించడం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే’ అని వయనాడ్ ఎంపీ తెలుగులో ఎక్స్‌లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.

'ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి' : కేటీఆర్

సోమవారం పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటైన అన్ని రాష్ట్రాల్లో సంబరాలతో పోలిస్తే తెలంగాణను ఏపీ నుంచి వేరు చేయడం వల్ల చేదు, రక్తపాతం జరుగుతోందని మోదీ అన్నారు. మోడీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు, ఆయన మాటలు రాష్ట్రంపై ఆయనకున్న ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

ఇదిలా ఉండగా, మంగళవారం పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు సోమవారం నాడు పాత పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్లో ‘75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణం’ అనే అంశం మీద చర్చ జరిగింది. దీనిని మోదీ ప్రారంభిస్తూ ప్రసంగించారు. ఈ సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు.  

‘ఈ పార్లమెంట్ భవనంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. కానీ సరిగా జరగలేదు. వాజ్ పేయి హయాంలో ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణను ఏర్పాటు చేయలేకపోయారు. ఆ సమయంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలను ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేశారు. దీంతో అన్ని ప్రాంతాలు సంబరాలు చేసుకున్నాయి. కానీ యూపీఏ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా లేకపోవడంతో  ఏపీ నుంచి తెలంగాణను వేరు చేసిన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య  అగాధం నెలకొంది… రక్తం చిందింది’ అని అన్నారు.  

అటు తెలంగాణ ప్రజలు కానీ, ఇటు ఏపీ ప్రజలు ఇద్దరూ సంబరాలు చేసుకోలేదని అన్నారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నేతలు విరుచుకుపడుతున్నారు. మోడీ తెలంగాణ మీద మరోసారి విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్