ప్రేమించడం లేదని యువతిపై కోపం.. దారుణ హత్య.. కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఘటన

Published : Sep 20, 2023, 06:50 AM IST
ప్రేమించడం లేదని యువతిపై కోపం.. దారుణ హత్య.. కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఘటన

సారాంశం

తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు యువతి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టి, అనంతరం ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది.

ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు కోపం పెంచుకున్నాడు. తనతో మాట్లాడాలని ఎంతో బలవంతం చేస్తున్నా వినకుండా వేరే వాళ్లతో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఆమెను దారుణంగా కొట్టాడు. అనంతరం హత్య చేశాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రధానికి పదేళ్లు ఎందుకు పట్టింది - రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్

వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావ్‌పేటలో దంద్రే కమలాకర్ అనే యువకుడు డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అదే గ్రామంలో 19 ఏళ్ల దీప ఇంటర్ పూర్తి చేసింది. కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కూలీ పనులకు వెల్తోంది. కాగా.. గ ఆరు నెలల నుంచి కమలాకర్ దీప వెంటన పడుతున్నాడు. ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. కానీ దానికి దీప అంగీకరించలేదు. అప్పటి నుంచి ఆమెపై కమలాకర్ కోపంతో ఉన్నాడు.

ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడికి ఎస్ఐ ప్రయత్నం.. బట్టలూడదీసి, స్తంభానికి కట్టేసి, చితకబాదిన గ్రామస్తులు

దీప ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని, కుటుంబంలోని అందరినీ హతమారుస్తానని హెచ్చరిస్తూ ఆమెకు మెసేజ్ లు చేసేవాడు. కాగా.. గత ఆదివారం దీప కుటుంబంలోని సభ్యులందరూ చేన్లోకి వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. దీనిని అతడు అదనుగా భావించి సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డాడు.

ఆ విషయంలో ద్వంద్వ వైఖరి మానుకోవాలి : సోనియా గాంధీపై బండి సంజయ్ ఫైర్

తనను ప్రేమించకుండా ఇతరులతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నిస్తూ ఆమెపై దాడి చేశాడు. తరువాత ఆ ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాను తీసుకొని, దీప్తి నోట్లో బలవంతంగా పోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే దీప్తి బయటకు వచ్చింది. తనను కాపాడాలని స్థానికులను కోరింది. వారంతా అప్రమత్తమై ఆమెను సిర్పూర్ (టి) హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. కరీంనగర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె పరిస్థితి విషమించింది. మంగళవారం ఉదయం చనిపోయింది.

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్