బీజేపీ నేతలు అవగాహన లేకుండా ధర్నాలు చేస్తున్నారు.. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

By team telugu  |  First Published Nov 11, 2021, 3:00 PM IST

బీజేపీ ధాన్యం కొనుగోలుపై (paddy procurement) కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందని  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) విమర్శించారు. బీజేపీ నాయకులు తెలంగాణలో కాకుండా.. కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ఢిల్లీలో ధర్నాలు చెయ్యాలని డిమాండ్ చేశారు. 


రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం(నవంబర్ 12) ధర్నాలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు వానాకాలం పంటను కొంటున్నామని..  రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 1000 కోట్ల రూపాయలకు పైగా వేశామని చెప్పారు.  బీజేపీ రాజకీయ ప్రస్తానమే అబద్ధాలతో కూడుకున్నదని ఆరోపించారు.  ధర్నా చౌక్ మేము తాము ఎత్తివేయ్యలేదని అన్నారు. అక్కడి ప్రజలు వద్దన్నారని.. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో మళ్ళీ ధర్నా చౌక్ వద్ద ధర్నాలకు అవకాశం వచ్చిందని తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకవేశ ముఖ్యమంత్రి ధర్నా చేయాల్సి వస్తే ఢిల్లీలో చేస్తారని అన్నారు. రేపు హైదరాబాద్‌లో జరిగే ధర్నాలో హైదరాబాద్ నాయకులు పాల్గొంటారని చెప్పారు. 

Latest Videos

undefined

Also read: వరిపై కేసీఆర్ పోరు: రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్‌కు షరతులతో అనుమతి

ప్రభుత్వానికి మిల్లర్లకు  ఎఫ్‌సీఐకి బియ్యం ఇచ్చేందుకు సంబంధించిన  ఒప్పందం ఉంటుందని.. దీనికి వారికి కమిషన్ కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. బీజేపీ ధాన్యం కొనుగోలుపై (paddy procurement) కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోందని విమర్శించారు. నిన్నటి వరకు 3,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు. డబ్బులు కూడా రైతులకు జాప్యం లేకుండా  చెల్లిస్తున్నామని చెప్పారు.  బీజేపీ నాయకులు సోయి- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.  కనీస జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తెలంగాణలో కాకుండా.. కేంద్రప్రభుత్వం కార్యాలయాలు, ఢిల్లీలో ధర్నాలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ధర్నాలు చేస్తుంది రైతులు కాదని.. మారువేషంలో బీజేపీ నాయకులే ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
 
2019- 20 లో కోటి 19లక్షల మెట్రిక్ టన్నులు, గతేడాది కోటి 40లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందన్నారు.  ఏ రాష్టంలోనైనా మార్కెట్ల దగ్గరకు రైతులు వెళ్తారని.. కానీ తెలంగాణలో మాత్రం మార్కెట్ నే రైతుల దగ్గరకు తీసుకుపోయామని చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట ఉందా లేదా అని కేంద్రాన్ని బండి సంజయ్ అడిగి తెలుసుకోవాలన్నారు. గతంలో 60 లక్షల ఎకరాల్లో ధాన్యం వేశామని.. ఇప్పుడు 60 నుంచి 80లక్షల ఎకరాల్లో ధాన్యం వేసేందుకు సిద్ధంగా ఉంచామని చెప్పుకొచ్చారు. రానున్న వేసవిలో పంటను కొంటామని కేంద్రం నుంచి లెటర్ బండి సంజయ్ ఇప్పించాలి డిమాండ్ చేశఆరు.

click me!