వరి ధాన్యం కొనుగోలు కోసం ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించే ధర్నాకు హైద్రాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు టీఆర్ఎస్ కు షరతులతో కూడిన అనుమతిని గురువారం నాడు ఇచ్చారు. ఈ విషయమై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలీసులను కోరాడు.
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ ధర్నాకు హైద్రాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు షరతులతో అనమతిని ఇచ్చారు.వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత కోరుతూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీంతో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ ధర్నాలకు టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం kcr పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల అనుమతిని తీసుకోని ధర్నాలు చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 10న పార్టీ నేతలకు సూచించారు. హైద్రాబాద్ కు చెందిన నేతలు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ విషయమై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ ధర్నాకు అనుమతిని కోరారు. అయితే షరతులతో సెంట్రల్ జోన్ పోలీసులు టీఆర్ఎస్ ధర్నాకు అనుమతిని ఇచ్చారు.
undefined
also read:ఆ బియ్యం కొనకుంటే మీ ఇళ్లముందే ధర్నా..: బిజెపి నాయకులకు మంత్రి గంగుల వార్నింగ్ (వీడియో)
వరి ధాన్యం కొనుగోలు విషయమై bjp, trs మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. paddy ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత వచ్చే వరకు కేంద్రాన్ని వెంటాడుతామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ విమర్శలకు బీజేప తెలగాణ చీఫ్ bandi Sanjay, కేంద్ర మంత్రి Kishan reddyలు స్పందించారు. బాయిల్డ్ రైస్ మినహా రా రైస్ ను కొనుగోలు చేసేందుకు కేంద్రానికి ఇబ్బంది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అయితే రా రైస్ ను దశలరారీగా కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు.
వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ రేపు ధర్నాలకు పిలుపునిచ్చింది. అయితే వర్షాకాలంలో రైతులు పండిండిచన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ ఇశాళ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించింది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రంపై విమర్శలు చేస్తోందని తెలంగాణుకు చెందిన బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.. వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించినా కూడా బీజేపీ నేతలు రైతులను ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు.యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నాలు చయాలని మంత్రి కమలాకర్ సూచించారు.'యాసంగి పంట విషయంలో మీరే బాధ్యత తీసుకొండి,బియ్యం రూపంలో పంటను కొనాల్సిన అవసరం కేంద్రానిదేనని మంత్రి తేల్చి చెప్పారు.