Hyderabad woman stabbed: యువతిపై దాడి కేసులో ప్రేమోన్మాది బస్వరాజుకు రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు..

Published : Nov 11, 2021, 02:12 PM IST
Hyderabad woman stabbed: యువతిపై దాడి కేసులో ప్రేమోన్మాది బస్వరాజుకు రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు..

సారాంశం

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో (LB nagar) పెళ్లికి నికారకరించిందనే కోపంతో యువతిపై కక్షగట్టి విచక్షణ రహితంగా కత్తితో దాడి (woman stabbed) చేసిన నిందితుడు బస్వరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం న్యాయస్థానం నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో (LB nagar) పెళ్లికి నికారకరించిందనే కోపంతో యువతిపై కక్షగట్టి విచక్షణ రహితంగా కత్తితో దాడి (woman stabbed) చేసిన నిందితుడు బస్వరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను కోర్టుకు వివరించారు. దీంతో న్యాయస్థానం నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంత‌రం బ‌స్వ‌రాజును పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. మరోపై బస్వరాజు దాడిలో గాయపడిన యువతి ఆస్పప్రతిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని.. 48 గంటలు గడిస్తేనే గానీ ఏం చెప్పలేమని అన్నారు.

వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మం డలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజ్‌(23) హైదరాబాద్‌లో రాందేవ్‌గూడలో ఉన్న సన్‌సిటీలో ఉంటూ సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు.  అదే మండలానికి చెందిన యువతి (20) గతేడాది హస్తినాపురం సెంట్రల్‌లోని తన పిన్ని వద్ద ఉంటోంది. ఈమె ఇంటర్‌ పూర్తి చేసింది. దూరపు బంధువైన ఆ యువతితో బస్వరాజ్‌కు పరిచయం ఉంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమె మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. 

Also read: పెళ్లైన నెల రోజులకే విషాదం: హైద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

అయితే కుటుంబ సభ్యులను ఎదురించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి ఏం చేయలేకపోయింది. మరోవైపు బస్వరాజు తరచూ యువతికి ఫోన్‌లు చేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఆమె బయటకు వచ్చినప్పుడు.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేవాడు. అయితే యువతి మాత్రం తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెప్పింది. యువతి నిశ్చితార్థం ఫొటోలను చూసిన బస్వరాజ్‌.. తనను పెండ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. వేధింపులు భరించలేక అతని ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసింది.

Also read: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: బస్సు, ట్యాంకర్ ఢీ 12 మంది సజీవ దహనం

ఈ క్రమంలోనే గురువారం యువతి ఉంటున్న ఇంటికి చేరుకున్న బస్వరాజు ఆమెను ఇంటిలో నుంచి బయటకు లాగి గొడవపడ్డాడు. విచక్షణ రహితంగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. వద్దని వేడుకున్న వినిపించుకోకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. దీంతో యువతి చేతులు, వీపు, ఛాతీ, తొడ, కడుపు భాగాల్లో మొత్తం 18 కత్తిపోట్లు గాయాలయ్యాయి. కొందరు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. అక్కడి నుంచి పారిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్