భర్త్ డే విషెస్ చెబితే... థ్యాంక్స్ పప్పు అంటూ కేటీఆర్ ట్వీట్

By Arun Kumar PFirst Published Jul 25, 2021, 8:20 AM IST
Highlights

తన సోదరుడు కేటీఆర్ కు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే విషెస్ తెలిపిన సోదరిని సరదాగా పప్పు అంటూ సంబోధిస్తూ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్సింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేరు నిన్న(శనివారం) సోషల్ మీడియాలో మారుమోగింది. రాజకీయ, సినీ ప్రముఖులే కాదు సాధారణ పౌరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సోదరి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో విషెస్ తెలపగా కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికరంగా బదులిచ్చారు. 

Thanks Pappu 😊 https://t.co/OtfNtLiKnm

— KTR (@KTRTRS)

 

''హ్యాపీ భర్త్ డే అన్నయ్య!! ఈ సంవత్సరం నీకు అన్ని విజయాలే వరించాలని.... నువ్వు ఆనందంగా వుడాలని కోరుకుంటున్నా'' అంటూ కేటీఆర్ తో అప్యాయంగా దిగిన పోటోను జతచేస్తూ కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ''థ్యాంక్స్  పప్పు'' అంటే కేటీఆర్ రిప్లై ఇచ్చారు. విషెస్ చెబుతూ కవిత ట్వీట్... ఆమెను పప్పు అంటు కేటీఆర్ సంబోధించడం టీఆర్ఎస్ అభిమానులను మరింత ఆకర్షిస్తోంది. 

read more  తెలంగాణ మంత్రి కేటీఆర్ కి వైఎస్ షర్మిల బర్త్ డే గిఫ్ట్..!

మంత్రి కేటీఆర్ 45వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు  ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్టు హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. హరీశ్ రావు ట్విట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. ధన్యవాదాలు బావ.. ఆయన అంటూ రిప్లే ఇచ్చారు.

ఎంపీ సంతోష్ కుమార్  కూడా.. కేటీఆర్ కి  స్పెషల్ గా విషెస్ తెలియజేశారు. కేటీఆర్ చిన్నప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో రెండింటినీ కలిపి..  సోదరుడు అని పేర్కొంటూ విషెస్ చెప్పారు.  అప్పటికీ ఇప్పటికీ.. తన అన్న ముఖం పై చిరు నువ్వు మారలేదని పేర్కొంటూ ట్వీట్ చేశారు. 

click me!